News December 28, 2025

29న పుట్టపర్తిలో రెవెన్యూ క్లినిక్ ప్రారంభం

image

పుట్టపర్తిలో ఈనెల 29న ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. సులభంగా, వేగవంతంగా రెవెన్యూ సేవలు అందించడమే లక్ష్యమన్నారు. అడంగల్ సవరణలు, మ్యుటేషన్, 1బి, పట్టాదారు పాస్‌పుస్తకాలు, అసైన్‌మెంట్, 22ఏ, భూ సమస్యల పరిష్కారానికి డివిజన్ వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రైతులకు జనవరి 2 నుంచి 9 వరకు కొత్త పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు.

Similar News

News December 29, 2025

సీఎం చంద్రబాబును కలిసిన గుడిసె క్రిష్ణమ్మ

image

కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ సోమవారం CM చంద్రబాబు నాయుడును కలిశారు. జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై సీఎంతో చర్చించారు. కార్యకర్తలతో సమన్వయంగా ఉంటూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆమెకు సూచించారు. పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని క్రిష్ణమ్మ తెలిపారు. జిల్లా రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

News December 29, 2025

PDPL: యూరియాపై శుభవార్త చెప్పిన కలెక్టర్

image

రైతులకు యాసంగి సీజన్‌లో యూరియా కొరత లేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. జిల్లాకు అవసరమైన 38 వేల మెట్రిక్ టన్నుల యూరియాకు గాను ఇప్పటికే 15,162 మెట్రిక్ టన్నులు అందాయని తెలిపారు. ప్రస్తుతం 10,131 మెట్రిక్ టన్నుల స్టాక్ అందుబాటులో ఉందన్నారు. ప్యాక్స్, RSK, DCMS, FPOల ద్వారా సరఫరా జరుగుతోందని, కొరతపై దుష్ప్రచారాలను రైతులు నమ్మవద్దన్నారు. అవసరమైతే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని తెలిపారు.

News December 29, 2025

పెద్దపల్లి: 8 పాఠశాలలకు జిల్లా స్థాయి అవార్డులు

image

పెద్దపల్లి జిల్లాలో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 8 పాఠశాలలకు జిల్లా స్థాయి స్వచ్ఛ పాఠశాల అవార్డులు అందజేశారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్ష అవార్డులు, ప్రశంస పత్రాలు పంపిణీ చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, పరిశుభ్రత, హైజిన్, మిషన్ లైఫ్ అంశాలను లెక్కించి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంతో విద్యార్థుల్లో ఆరోగ్యం, పర్యావరణ అవగాహన పెరిగిందని పేర్కొన్నారు.