News November 20, 2025

29న పెద్దపల్లిలో సదర్‌ ఉత్సవాలు

image

పెద్దపల్లిలో ఈ నెల 29న సదర్‌ ఉత్సవాలను నిర్వహించనున్నామని ఉత్సవ సమితి పెద్దపల్లి జిల్లా ఛైర్మన్‌ మేకల విజయ్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. బుధవారం పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాదవుల సంప్రదాయాలను చాటి చెప్పేలా ఈ సదర్‌ ఉత్సవాలను చేపడుతామన్నారు. జిల్లాలోని యాదవ సంఘాల నేతలు, కుల బాంధవులు, యువజన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News April 13, 2026

కొండవీడు కోటపై ‘నైట్ క్యాంపింగ్’.. ప్రకృతి ఒడిలో రాత్రి బస!

image

పల్నాడు జిల్లాలోని చారిత్రక కొండవీడు కోటపై పర్యాటకుల కోసం అటవీశాఖ నైట్ టెంట్ క్యాంపింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో రాత్రి బసతో పాటు మ్యూజికల్ నైట్, క్యాంప్ ఫైర్, సూర్యోదయ వీక్షణ, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. ధర పెద్దలకు రూ. 2,000, ఎనిమిదేళ్లలోపు పిల్లలకు రూ. 1,000గా నిర్ణయించారు. వీటితో పాటు ట్రెక్కింగ్, బోటింగ్ వంటి అడ్వెంచర్ క్రీడలు కూడా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచనున్నాయి.

News April 13, 2026

PHOTO: కండలు తిరిగిన శరీరంతో Jr.NTR

image

‘డ్రాగన్’ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకుంటున్నారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ కండలు తిరిగిన బాడీ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది క్షణాల్లోనే వైరలైంది. తారక్ బాడీ బాక్సాఫీస్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

News April 13, 2026

చర్చలు విఫలం.. మార్కెట్లలో బ్లడ్‌బాతేనా?

image

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడం, క్రూడాయిల్ ధర పెరగడంతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. యుద్ధం ఇంకా కొనసాగనుండటంతో ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకే మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జపాన్ నిక్కీ-225.. 0.80%, టోపిక్స్ 0.42% నష్టపోయాయి. సౌత్ కొరియా కోప్సి 1.83%, కొస్దాక్ 1.43%, హాంగ్‌కాంగ్ హాంగ్ సెంగ్, ఆస్ట్రేలియా S&P/ASX 200 మైనస్‌లో ట్రెండ్ అవుతున్నాయి.