News January 19, 2025
29 నుంచి దేవుని కడప వార్షిక బ్రహ్మోత్సవాలు

ఈనెల 29 నుంచి తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు దేవుని కడప వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనుండగా, 28న సాయంత్రం అంకురార్పణ, 29న ఉదయం 9.30 గంటలకు ధ్వజారోహణం ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఫిబ్రవరి 3న స్వామి వారి కళ్యాణం, 4న వైభవంగా రథోత్సవం, ఫిబ్రవరి 7న పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
Similar News
News November 25, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నేడు మంగళవారం బంగారం వెండి ధరలు వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్లు 1 గ్రాము: రూ.12590
☛ బంగారం 22 క్యారెట్లు 1 గ్రాము: రూ.11583
☛ వెండి 10 గ్రాములు రూ.1616
ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నేడు మంగళవారం బంగారం వెండి ధరలు వివరాలు:
News November 25, 2025
ప్రొద్దుటూరు వ్యాపారి తనికంటి సోదరులకు బెయిల్..!

ప్రొద్దుటూరు జ్యువెలరీ వ్యాపారి తనికంటి శ్రీనివాసులు, ఆయన సోదరుడు వెంకటస్వామికి ప్రొద్దుటూరు మొదటి ADM కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జడ్జి సురేంద్రనాధ రెడ్డి సోమవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. HYDకు చెందిన హేమంత్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుపై బెదిరింపు, కిడ్నాప్, దాడి కేసుల్లో తనికంటి సోదరులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వ్యక్తిగత ష్యూరిటీతో వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
News November 25, 2025
ప్రొద్దుటూరులో జువెలరీ దుకాణం మూత..! బాధితుల గగ్గోలు

ప్రొద్దుటూరులోని తనకంటి జ్యూవెలరీ దుకాణం మూడు రోజులుగా మూత పడింది. దాంతో బంగారు సరఫరాదారులు, ఆభరణాలకు అడ్వాన్స్ ఇచ్చిన వారు, స్కీముల్లో, చీటిల్లో డబ్బులు కట్టిన వారంతా ఆందోళన చెందుతున్నారు. డబ్బులు కట్టినవారికి జీఎస్టీ రసీదులివ్వకుండా, చీటీలు రాసి ఇవ్వడంతో బాధితులు గగ్గోలు చెందుతున్నారు. వ్యాపారి శ్రీనివాసులును చీటింగ్, కిడ్నాప్, దాడి కేసుల్లో పోలీసులు విచారణ చేస్తుండడంతో ఆందోళన పడుతున్నారు.


