News August 24, 2024
29 న ఏడు స్థాయి సంఘాల సమావేశం

నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈనెల 29వ తేదీ జిల్లాపరిషత్ కు సంబంధించిన ఏడు స్థాయి సంఘాల సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈవో కన్నమనాయుడు తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య, ఆర్ అండ్ బి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, గృహనిర్మాణ, విద్యుత్ శాఖ, పశుసంవర్థక, మత్స్య, ఉద్యానవన, విద్య, వైద్య, ఐసీడీఎస్, గిరిజనాభివృద్ది, సాంఘిక సంక్షేమ శాఖలతో సమావేశం జరుగుతుందన్నారు.
Similar News
News December 22, 2025
నెల్లూరు జిల్లాలో 97.63% పోలియో వ్యాక్సిన్ పూర్తి

జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల్లో 97.63 శాతం పోలియో వ్యాక్సిన్ వేసినట్లు జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ సుజాత తెలియజేశారు. 2వ రోజు ఇంటింటి పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య, అంగన్వాడి సిబ్బంది 50,3741 గృహాలను సందర్శించి 4,461 మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేశారన్నారు. మిగిలిన వారికి మంగళవారం పూర్తి చేస్తామన్నారు.
News December 22, 2025
పోలీసుల అభ్యున్నతికి క్రమశిక్షణే పునాది: SP అజిత

పోలీసుల అభ్యున్నతికి క్రమశిక్షణే పునాది అని ఎస్పీ అజిత వేజెండ్ల అన్నారు. సోమవారం ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభం అయింది. దీనికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగాయని వాటిని అరికట్టాలంటే పోలీసులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమన్నారు. చట్టాలపై అవగాహన అవసరమని, దేహధారుడ్యం, మనోనిబ్బరంపై దృష్టిసారించాలని ఆమె కోరారు.
News December 22, 2025
నెల్లూరు: కరెంటోళ్ల జనబాట పోస్టర్లు, యాప్ ఆవిష్కరణ

APSPDCLఆధ్వర్యంలో రూపొందించిన కరెంటోళ్ల జనబాట పోస్టర్లు, యాప్ను కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ఆవిష్కరించారు. వినియోగదారుల సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రతి మంగళవారం, శుక్రవారం జనబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నేరుగా గ్రామాలు, పట్టణ వార్డుల్లో పర్యటించి వినియోగదారులతో మమేకం కానున్నారు.


