News April 20, 2024

29 వరకు బీఈడీ సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు

image

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) రెండో సంవత్సరం, రెండో సెమిస్టర్ (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) పరీక్ష ఫీజు తేదీని కేయూ అధికారులు ప్రకటించారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 29లోపు చెల్లించవచ్చని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి నర్సింహా చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి రాధిక తెలిపారు. ఆలస్య రుసుంతో మే 5 వరకు చెల్లించవచ్చన్నారు.

Similar News

News October 2, 2024

పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

image

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపాలన విభాగం భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీలు, ఏసీపీలు సీఐలతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ మార్గంలోనే నేటి యువత ప్రయాణించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.

News October 2, 2024

WGL: రేపటి నుంచి ఉచిత చేప పిల్లల పంపిణి

image

రేపటి నుంచి ఉచిత చెప పిల్లల పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మత్సశాఖ సంచాలకులు అల ప్రియాంక తెలిపారు. తొలి విడతగా తొమ్మిది జిల్లాలు హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాలలో చేపపిల్లల పంపిణీని ప్రారంభిస్తారు. రెండో విడతలో మిగిలిన జిల్లాల్లో ఈనెల ఏడో తేదీ నుంచి పంపిణీ ప్రారంభమవుతుందని ప్రియాంక తెలిపారు.

News October 2, 2024

వరంగల్: మరికాసేపట్లో DSC సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

వరంగల్ జిల్లాలో DSCలో SGT అభ్యర్థులు 1 :3నిష్పత్తిలో 435 మంది, SGT ఉర్దూలో 25 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అర్హత సాధించారని డీఈఓ జ్ఞానేశ్వర్ తెలిపారు. బుధవారం ఉ.10 గంటల నుంచి సా. 5 గంటల వరకు GTలో 270 మంది, SGT ఉర్దూలో 25 మంది అభ్యర్థులు వెరిఫికేషన్‌కు రావాలన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో, రెండు సెట్లు గెజిటెడ్ తప్పనిసరన్నారు. వివరాలకు www.deowarangal.net సంప్రదించాలన్నారు.