News January 11, 2026

29, 30న ఉప లోకాయుక్త క్యాంప్ సిట్టింగ్

image

విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈనెల 29, 30వ తేదీల్లో ఏపీ ఉప లోకాయుక్త పి.రజని ఆధ్వర్యంలో క్యాంప్ సిట్టింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఈ క్యాంప్‌లో పాల్గొని ప్రభుత్వ అధికారుల అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై కొత్త ఫిర్యాదులు అందజేయవచ్చునని ఆమె తెలిపారు. పారదర్శక పాలనే లక్ష్యంగా జరిగే ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News January 17, 2026

మద్దిలపాలెంలో బస్సు కింద పడి వ్యక్తి మృతి

image

విశాఖలోని మద్దిలపాలెంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, స్కూటీ ఒకే దిశలో వెళ్తుండగా, స్కూటీ అదుపుతప్పి పల్సర్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో స్కూటీ నడుపుతున్న వ్యక్తి బస్సు వెనుక చక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని.. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎంవీపీ సీఐ ప్రసాద్ తెలిపారు.

News January 17, 2026

పిల్లల్లో ఆటిజం ఉందా?

image

ఆటిజమ్ పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉంటారన్నది వారికి లభించే ప్రోత్సాహాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. కొందరు చిన్నారుల్లో సంగీతం, కంప్యూటర్లు, బొమ్మలు వేయటం వంటి నైపుణ్యం ఉంటుంది. అందువల్ల వీరిలో దాగిన నైపుణ్యాన్ని వెలికి తీయటానికి, మరింత సాన బెట్టటానికి ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. అలాగే వీరిలో సమన్వయం, ఏకాగ్రత పెరగటానికి ఆటలు బాగా తోడ్పడతాయంటున్నారు నిపుణులు.

News January 17, 2026

కేసీఆర్ నాకు శత్రువు కాదు: రేవంత్

image

TG: తనకెవరూ శత్రువులు లేరని, శత్రువు అనుకున్న వ్యక్తిని 2023లో బండకేసి కొట్టానని పాలమూరు సభలో సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. ‘ఆయన నడుము విరిగి ఫామ్‌హౌస్‌లో పడుకుంటే నేనెందుకు శత్రువు అనుకుంటా. ఆయన లేచి సరిగ్గా నిలబడ్డప్పుడు మాట్లాడతా. మహిళలకు అన్యాయం చేసేవాళ్లు, విద్యార్థులకు నష్టం కలిగించేవాళ్లు, చదువుకోకుండా ఊరిమీద పడి తిరిగేవాళ్లు, పేదరికమే నా అసలైన శత్రువులు’ అని వ్యాఖ్యానించారు.