News June 20, 2024
2వ రోజు డిప్యూటీ సీఎం పవన్ సమీక్షలు
రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సోషల్ ఆడిట్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తాజాగా సమాచారం వెలువడింది. కాగా నిన్న బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే పవన్ 10 గంటలపాటు సమీక్షలు నిర్వహించినట్లు జనసేన తమ అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసింది.
Similar News
News November 28, 2024
కృష్ణా: ‘ఈనెల 30వరకు ఆ పని చేయకండి’
నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు గరిష్ఠంగా 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నెల 30 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని APSDMA హెచ్చరించింది. వాయుగుండం ప్రభావం ఉన్నందున జిల్లా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
News November 28, 2024
నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న మంత్రి నాదెండ్ల
మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి పర్యటన పామర్రులో ప్రారంభమై పెడన నియోజకవర్గంలోని గూడూరు, పెడన, బంటుమిల్లి మీదగా కృత్తివెన్ను చేరనుంది. పర్యటన సందర్భంగా జిల్లాలోని పలువురు రైతులను కలసి వారి వ్యవసాయ సమస్యలు తెలుసుకోనున్నారు. అనంతరం పలు వ్యవసాయ శాఖ కార్యాలయాలను సందర్శించునున్నారు.
News November 28, 2024
పూర్తైన ఫ్లైఓవర్ పనులు.. మరింత వేగంగా హైదరాబాద్కు రాకపోకలు
విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిలో భాగమైన ప్రధాన ఫ్లైఓవర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కృష్ణా నదిపై సూరయపాలెం-వెంకటపాలెం మధ్య నిర్మిస్తున్న ఈ వంతెనకు ఫినిషింగ్ పనులు, బీటీ రోడ్ నిర్మించాల్సి ఉంది. ఈ వంతెన పూర్తై బైపాస్ రహదారి అందుబాటులోకి వస్తే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు విజయవాడ రాకుండా జాతీయ రహదారిపైకి వెళ్లవచ్చు. దీంతో విజయవాడలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.