News September 23, 2024
3న తిరుమలకు పవన్..?
తిరుమల లడ్డూకు వినియోగించే నెయ్యిపై తీవ్ర ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇది ముగిసిన తర్వాత ఆయన శ్రీవారిని దర్శించుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఆయన అక్టోబర్ 3న తిరుమలకు వచ్చే అవకాశం ఉందని జనసేన నాయకులు వెల్లడించారు.
Similar News
News October 9, 2024
12న స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్)కు విజయదశమి సందర్భంగా సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 12వ తేదీ శనివారం ఓపీ, ఓటీ సేవలు అందుబాటులో ఉండవు. స్విమ్స్ అత్యవసర విభాగం(క్యాజువాలిటీ) సేవలు యథాతథంగా కొనసాగుతాయని వీసీ ఆర్.వి.కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
News October 9, 2024
14 నుంచి కుప్పంలో భువనేశ్వరి పర్యటన
సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 14వ తేదీ నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నాలుగు రోజులపాటు కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో ఆమె పర్యటన కొనసాగుతుందని సమాచారం. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత రెండోసారి భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
News October 9, 2024
నేటి నుంచి రూ.49కే K.G టమాటా: చిత్తూరు జేసీ
చిత్తూరు రైతు బజారులలో నేటి నుంచి రాయితీ ధరతో టమాటాలు పంపిణీ చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ విద్యాధరి తెలియజేశారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన టమాటాను కిలో రూ. 49కే అందజేస్తామని ఆమె చెప్పారు. ఈ మేరకు రైతు బజారులో ఉదయం కౌంటర్ ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే ఉల్లిపాయలను అందిస్తామని స్పష్టం చేశారు.