News October 2, 2024

3న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

image

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబ‌రు 3వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేస్తారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షిస్తారు.

Similar News

News October 7, 2024

తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు

image

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుంచి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్ నామాలను ఊరేగింపుగా సోమ‌వారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ ఆర్‌.ఆర్‌.గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఈఓ శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఘన స్వాగతం పలికారు.

News October 7, 2024

తిరుమల: 1264 మందితో బందోబస్తు

image

గరుడ సేవ కోసం మూడు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని.. ఇందుకోసం 1264 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌లో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రోప్ పార్టీలతో భక్తుల రద్దీ నియంత్రించాలన్నారు. భద్రతా తనిఖీలు కొనసాగించాలన్నారు. ఏ చిన్న ఘటనకు ఆస్కారం ఇవ్వరాదన్నారు.

News October 7, 2024

పుంగనూరు: క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురి పరిస్థితి విషమం

image

చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం మేళం దొడ్డి సమీపంలో ఉన్న మేకనజామనపల్లి క్వారీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అక్కడ ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని వెంటనే పుంగనూరు, మదనపల్లెకు తరలించారు. కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ వారి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.