News November 2, 2025
3న కాకినాడలో పీజీఆర్ఎస్

కాకినాడ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని ఈ నెల 3న (సోమవారం) కాకినాడ కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌కు అర్జీదారులు హాజరై తమ సమస్యలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Similar News
News November 2, 2025
నేడు బిహార్‌లో ప్రధాని మోదీ ప్రచారం

నేడు ప్రధాని మోదీ బిహార్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భోజ్‌పుర్ జిల్లా అర్రాలో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. మ.3.30 గంటలకు నవాడాలో ప్రచార సభకు హాజరవుతారు. పట్నాలో సాయంత్రం 5.30 గంటలకు రోడ్‌షో నిర్వహిస్తారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పలు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
News November 2, 2025
GWL: ఇసుక క్వారీలపై నివేదిక సిద్ధం చేయాలి: కలెక్టర్

జోగులాంబ గద్వాల జిల్లాలోని చిన్న తరహా ఖనిజాలు, ఇసుక క్వారీలపై పూర్తిస్థాయి నివేదిక తయారు చేయాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నీటిపారుదల, భూగర్భ జల, గనులు మరియు భూగర్భ శాఖ, టీఎస్‌ఎండీసీ, అటవీ, రెవెన్యూ విభాగాల అధికారులు ఈ నివేదికలను సిద్ధం చేసి, ఆయా శాఖల కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు.
News November 2, 2025
ఉగ్రవాదులను తుడిచిపెట్టేస్తాం: ట్రంప్

నైజీరియాలో క్రైస్తవుల హత్యలు ఆగకపోతే అన్ని సహాయ సహకారాలు ఆపేస్తామని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఆ దేశంలోకి చొచ్చుకెళ్లి ఇస్లామిక్ ఉగ్రవాదులను పూర్తిగా నాశనం చేయొచ్చు. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని మా యుద్ధ విభాగాన్ని ఆదేశిస్తున్నా. క్రైస్తవులపై ఉగ్రవాదులు దాడి చేసినట్లుగానే మా దాడి వేగంగా, దారుణంగా, మధురంగా ఉంటుంది. నైజీరియా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలి’ అని హెచ్చరించారు.


