News October 2, 2024

3న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

image

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబ‌రు 3వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేస్తారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షిస్తారు.

Similar News

News March 3, 2026

చిత్తూరు పోలీసులకు 54 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 54 ఫిర్యాదుల అందినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 7, భూతగాదాలు 23 ఫిర్యాదులు ఉన్నాయి. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

News March 2, 2026

చిత్తూరు: పన్ను వసూళ్లకు 15 వరకు గడువు

image

చిత్తూరు జిల్లాలో పంచాయతీల్లో పన్నుల వసూళ్ల గడువును ఈనెల 15 వరకు ఇచ్చినట్లు డీపీవో సుధాకర్ రావు తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు జిల్లాలో 75 శాతం వసూళ్లు చేసినట్లు వెల్లడించారు. మొత్తం లక్ష్యం రూ.27.41 కోట్లు కాగా అందులో 75 శాతం అంటే రూ.20.55 కోట్లు రాబట్టామన్నారు. 15వ తేదీలోపు మిగిలిన 25 శాతం పన్నులను వసూలు చేయడానికి కృషి చేస్తామని వివరించారు.

News March 2, 2026

చిత్తూరు: టీచర్లకు గమనిక

image

టీచర్ల సీనియారిటీ జాబితాను టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టిస్) ఆధారంగా సిద్ధం చేసినట్లు చిత్తూరు డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. డీఈవో, డీవైఈవో, ఎంఈవోల మెయిల్స్‌కు పంపించామని.. అభ్యంతరాలు ఉంటే ఈనెల 10వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయ పనివేళల్లో తెలియజేయాలని సూచించారు. తగిన ఆధారాలతో సంబంధిత ఉప, మండల విద్యాశాఖాధికారులు ధ్రువీకరించిన పత్రాలను అందజేయాలన్నారు.