News March 25, 2024
3 నెలల్లో 1,284 మద్యం కేసులు నమోదు: ఎస్పీ

అనంతపురం జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 1,284 మద్యం కేసులు నమోదయ్యాయని అనంతపురం ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. 1,272 మందిని అరెస్టు చేసి 206 వాహనాలు సీజ్ చేశామన్నారు. ఎన్నికల దృష్ట్యా జిల్లాలోకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. జిల్లా సరిహద్దుల్లో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి చెక్ పోస్టులో ఆరుగురు సిబ్బంది పనిచేస్తారని వెల్లడించారు.
Similar News
News September 17, 2025
ఉరవకొండలో పవర్ విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు

ఉరవకొండలో సెరెంటికా రెన్యూవబుల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 250 మెగావాట్ల పవర్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. 50 గాలి మరలను ఏర్పాటు చేసి గ్రిడ్ అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో 320 మందికి ఉపాధి కలుగుతుంది.
News September 16, 2025
కలెక్టర్ల సమావేశానికి హాజరైన అనంత కలెక్టర్

అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం రెండో రోజు మంగళవారం జరిగింది. అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
News September 15, 2025
గుత్తి: 5 టన్నుల టమాటాలు పారబోశారు..!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో టమాటా ధరలు రోజు రోజుకు పతనం అవుతున్నాయి. కనీసం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. గుత్తికి చెందిన రైతులు 500 బాక్సులను మార్కెట్కు తీసుకు వచ్చారు. కిలో రూ.5, రూ.3 మాత్రమే పలకడంతో ఇలా హైవే పక్కన టమాటాలను రైతులు పారబోశారు.