News June 18, 2024

3 రోజుల వ్యవధిలో ఉన్నతాధికారులు ఇద్దరు బదిలీ

image

నల్లగొండ జిల్లాలో 3 రోజుల వ్యవధిలో జిల్లా ఉన్నతాధికారులు ఇద్దరు బదిలీ కావడం చర్చనీయంశంగా మారింది. వీరిద్దరూ జిల్లాకు ఈ ఏడాది తొలి వారంలో వచ్చారు. వచ్చిన 6నెల్లలోపే బదిలీ అయ్యారు. ఈ నెల15న కలెక్టర్‌ హరిచందన బదిలీ కాగా.. తాజాగా నిన్న జిల్లా ఎస్పీ చందనా దీప్తి కూడా బదిలీ అయ్యారు. చందనాదీప్తి స్థానంలో శరత్‌ చంద్ర పవార్‌ను జిల్లా ఎస్పీగా నియమించారు. హరిచందన స్థానంలో నారాయణ రెడ్డి బదిలీపై వచ్చారు.

Similar News

News February 23, 2026

సీఎం కప్ ఫుట్‌బాల్ ఛాంపియన్స్‌గా నల్గొండ!

image

HYDలో జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి బాలికల ఫుట్‌బాల్ పోటీల్లో నల్గొండ జట్టు సంచలనం సృష్టించింది. సోమవారం జరిగిన ఫైనల్ పోరులో నిజామాబాద్ జట్టుపై 4-2 గోల్స్ తేడాతో విజయం సాధించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా DYSO అక్బర్ అలీ మాట్లాడుతూ.. నల్గొండ క్రీడాకారిణులు అద్భుత ప్రతిభ కనబరిచారని కొనియాడారు. జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి గిరిబాబు తదితరులు విజేతలను అభినందించారు.

News February 23, 2026

నల్గొండ: మైనారిటీల ఆర్థికాభివృద్ధికి గోల్డెన్ ఛాన్స్

image

మైనారిటీల ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి రెండు కీలక పథకాల కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జిల్లాలో ఆసక్తి గలవారు మార్చి 1 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి టి.విజయేందర్ రెడ్డి తెలిపారు. వెబ్‌సైట్ :http://tsobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News February 23, 2026

సీఎం కప్ హాకీ రాష్ట్రస్థాయి విజేతగా నల్గొండ జట్టు

image

హైదరాబాద్‌ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో నల్గొండ బాలుర జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్‌లో నిజామాబాద్ జట్టుపై 2-0 తేడాతో గెలుపొంది ఛాంపియన్‌గా నిలిచింది. ఈ చరిత్రాత్మక విజయం పట్ల జిల్లా క్రీడల అధికారి అక్బర్ అలీ, హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఇమామ్ కరీం హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారులను అభినందించారు.