News January 8, 2026
3 మ్యాచులకు తిలక్ వర్మ దూరం

న్యూజిలాండ్‌తో జరిగే 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో తొలి 3 మ్యాచులకు తిలక్ వర్మ దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. మిగతా 2 మ్యాచుల్లో ఆయన ఆడే విషయంపై ఫిట్‌నెస్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. నిన్న ఆయనకు సర్జరీ జరిగినట్లు పేర్కొంది. తిలక్ ఆస్పత్రి నుంచి ఈరోజు డిశ్చార్జ్ అయ్యారని, రేపు HYDకు వస్తారని వెల్లడించింది. IND, NZ టీ20 సిరీస్ ఈ నెల 21 నుంచి జరగనుంది.
Similar News
News February 19, 2026
కోడి రెక్క ఆరబెడితే గొప్ప వర్షం

వర్షం పడబోయే ముందు గాలిలో తేమ పెరగడంతో పాటు వాతావరణంలో కొన్ని మార్పులు వస్తాయి. కోళ్లు వీటిని గ్రహించి తమ రెక్కలను విరబోసుకుని (ఆరబెట్టినట్లుగా) ఆడిస్తాయట. కోళ్లు అలా ప్రవర్తిస్తే, త్వరలోనే భారీ వర్షం కురుస్తుందని గ్రామాల్లోని ప్రజలు నమ్మేవారట. దీంతో పాటు నల్ల చీమలు వరుసగా వెళ్లటం, కప్పల బెకబెకలను విని.. వ్యవసాయ పనుల కోసం సిద్ధమయ్యే రైతులు తమ ధాన్యాన్ని, ఇతర వస్తువులను భద్రపరుచుకొనేవారట.
News February 19, 2026
శని, మంగళవారాల్లో కొనకూడని వస్తువులు

ఈ రెండ్రోజులు నువ్వులు, గుడ్లు, ఉప్పు, మిరియాలు, చెప్పులు కొనకూడదట. శాస్త్రాల ప్రకారం ఇవి నిషిద్ధమని పండితులు చెబుతున్నారు. ‘శనివారం నాడు ఇనుము, నూనె, చెప్పులు కొంటే శని ప్రభావం పెరిగి కష్టాలొస్తాయి. ఉప్పు, మిరియాలు గొడవలకు సంకేతాలు’ అంటున్నారు. ఈ నియమాలు పాటిస్తే అనవసర ఆర్థిక నష్టాలు, గొడవలు కలగకుండా ఉంటాయని నమ్మకం. ఈ రెండ్రోజులు సాత్వికాహారం తీసుకొని దానధర్మాలు చేస్తే శుభ ఫలితాలుంటాయని నమ్మకం.
News February 19, 2026
కరెంట్ అఫైర్స్

– భారత ఎయిర్‌ఫోర్స్ డే: అక్టోబర్ 8
– అశోకచక్ర 2026ను పొందినది: శుభాంశు శుక్లా
– దేశంలో తొలి బాల్య వివాహ రహిత జిల్లా: బలోద్ (MP)
– హ్యూమనాయిడ్ రోబో ARJUN గల రైల్వే స్టేషన్: విశాఖపట్నం
– డ్రైవర్ రహిత మెట్రో రైలు ట్రయల్ జరిగిన నగరం: చెన్నై
– ఉద్యోగినులకు నెలసరి సెలవు తప్పనిసరి చేసిన రాష్ట్రం: కర్ణాటక
> రోజూ ఉదయం 5amకు కరెంట్ అఫైర్స్ పొందండి


