News February 5, 2025
‘3 రోజులు మాంసం, మద్యం దుకాణాలు బంద్ చేయాలి’

ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీహరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బుధవారం నుంచి శుక్రవారం వరకు గ్రామంలో చికెన్, మటన్ విక్రయాలు చేయవద్దని బజరంగ్ దళ్ మండల నాయకులు విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని దాభాలు, వైన్ షాప్‌ల నిర్వాహకులు మూడు రోజుల వరకు విక్రయాలు చేయకుండా తమకు సహకరించాలని కోరారు.
Similar News
News December 29, 2025
వేములవాడ: ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు పరిశీలించిన ఆలయ ఈవో, ఏఎస్పీ

వేములవాడ శ్రీ భీమేశ్వరాలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈవో ఎల్ రమాదేవి, ఏఎస్పీ రుత్విక్ సాయి పరిశీలించారు. మంగళవారం తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం వద్ద శ్రీ స్వామివారి దర్శనం ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా చేపట్టిన ఏర్పాట్లను వారు పరిశీలించి ఆలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
News December 29, 2025
రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి: జేసీ

రబీ సాగులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగినంత యూరియా అందుబాటులో ఉంచాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ నుండి రైతు ప్రతినిధులు, అధికారులతో గూగుల్ మీట్ ద్వారా ఆయన సమీక్షించారు. అన్ని మండలాల్లో అవసరమైన మేర నిల్వలు ఉండేలా చూడాలని, పంపిణీలో పారదర్శకత పాటించాలని సూచించారు. సాగు అవసరాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News December 29, 2025
NGKL: యాసంగి పంటకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి: మంత్రి

జిల్లాలో యాసంగి పంటకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ బదావత్ సంతోష్‌తో పాటు అదనపు కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో యాసింగి పంట ఏర్పాట్లపై జిల్లా అధికారులు మంత్రికి వివరించారు.


