News January 7, 2026

3 రోజుల్లో అన్నమయ్య జిల్లాలో వర్షాలు

image

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం వచ్చే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Similar News

News February 4, 2026

ఆత్మవిశ్వాసానికి సంకేతం ‘మణిపూరక చక్రం’

image

బొడ్డు భాగంలో ఉండే ఈ చక్రం ఆత్మవిశ్వాసానికి సంకేతం. ఇది సమతుల్యంగా ఉంటే నిర్ణయాలు తీసుకునే శక్తి, నాయకత్వ లక్షణాలు, మంచి జీర్ణక్రియ కలుగుతాయి. ఇది అస్థిరంగా మారితే అజీర్తి, షుగర్, ఎదుటివారిపై అధికారం చెలాయించే స్వభావం పెరుగుతాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి ‘రం’ మంత్రాన్ని ధ్యానించాలి. పసుపు రంగు దుస్తులు ధరించడం, సూర్యరశ్మిలో గడపడం, యోగ, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఈ చక్రాన్ని మేల్కొల్పవచ్చు.

News February 4, 2026

ఆయిల్ పామ్ సాగులో ఇవి కీలకం

image

ఆయిల్ పామ్ సాగుకు నీటి సదుపాయం కీలకం. 2 అంగుళాల బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా రోజూ 2,3 గంటలు.. వేసవిలో 4,5 గంటలు నీరివ్వాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి నిపుణుల సూచనలతో ఎరువులు తప్పక వేయాలి. పంట దిగుబడికి ఫలదీకరణం కీలకం. అందుకే మొక్క నాటిన ఏడాదిన్నర నుంచి మూడేళ్ల వరకు వచ్చే పొత్తులను తీసేయాలి. దీని వల్ల మొక్క మాను బాగా వృద్ధిచెందుతుంది. భవిష్యత్తులో గెలలు నిండుగా వచ్చి బరువు పెరుగుతాయి.

News February 4, 2026

మహిళా పారిశ్రామికవేత్తలకు డిజిటల్ సాధికారత

image

GHMC, MEPMA- ISB సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సూక్ష్మ పారిశ్రామిక వేత్తలకు డిజిటలైజేషన్, వ్యాపార సామర్థ్య పెంపుపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 400 మంది మహిళలకు వాట్సాప్ బిజినెస్, ఇన్స్టాగ్రామ్ స్టోర్‌ఫ్రంట్స్, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. సూక్ష్మ రుణాల లభ్యత, మార్కెటింగ్ మెళకువలతో మహిళా స్వయం ఉపాధి రంగాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.