News September 19, 2024
3 రోజుల్లో సాగర్ ఆయకట్టుకు సాగునీటి విడుదల

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఎస్ఎల్బీసీ హై లెవెల్ కెనాల్‌కు సంబంధించిన నాలుగో పంపు మరమ్మతులు పూర్తయ్యాయని, 3 రోజుల్లో ఈ పంపు ద్వారా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తామని ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వి.అజయ్ కుమార్ తెలిపారు. దీంతో ప్రాజెక్టు కాలువల్లో నీరు సమృద్ధిగా పారుతుందని రైతులెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు.
Similar News
News February 21, 2026
నల్గొండ: పాఠశాలల్లో కంప్యూటర్ల రిపేర్లకు కోటేషన్ల ఆహ్వానం!

జిల్లాలోని 200 ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఐఎఫ్‌పీ స్క్రీన్ల మరమ్మతుల కోసం సమగ్ర శిక్షా విభాగం కోటేషన్లను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల సంస్థలు ఈ నెల 23 నుంచి మార్చి 2వరకు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని డీఈఓ భిక్షపతి తెలిపారు. మార్చి 3న కలెక్టరేట్‌లో ఈ కోటేషన్లను తెరుస్తారని ఆయన పేర్కొన్నారు.
News February 21, 2026
నల్గొండలో 24న మినీ జాబ్ మేళా

నల్గొండలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 24న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎన్. పద్మ తెలిపారు. ఐటీఐ క్యాంపస్‌లోని ఉపాధి కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ మేళా ప్రారంభమవుతుందని తెలిపారు. ఇతర వివరాలకు 7893420435 నంబర్‌ను సంప్రదించాలని ఆమె కోరారు.
News February 21, 2026
నల్గొండ: నేతన్నలకు అవార్డులు.. దరఖాస్తుల ఆహ్వానం

2026 జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని ‘శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ’ రాష్ట్ర అవార్డులకు దరఖాస్తులు కోరుతున్నారు. 30 ఏళ్ల వయస్సు, 10 ఏళ్ల అనుభవం ఉన్న చేనేత కళాకారులు; 25 ఏళ్ల వయస్సు, 5 ఏళ్ల అనుభవం ఉన్న డిజైనర్లు అర్హులు. ఆసక్తి గలవారు మార్చి 31, 2026 లోపు జిల్లా చేనేత కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.


