News February 12, 2026

3 రౌండ్లలో నారాయణపేట మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు

image

నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులకు ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించగా, ఫిబ్రవరి 13న ఉదయం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం రెండు కౌంటింగ్ హాళ్లలో నాలుగు టేబుళ్ల చొప్పున మొత్తం ఎనిమిది టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్‌లో 8 వార్డుల చొప్పున మూడు రౌండ్లలో మొత్తం 24 వార్డుల ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు.

Similar News

News February 22, 2026

సిరిసిల్ల: అప్పుల బాధతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

image

ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్న ఘటన ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమనేని అంజయ్య (42) సొంత ఊరిలో ఉపాధి లేక హైదరాబాదులో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేశాడు. అప్పులు ఎక్కువ అవడంతో మనస్తాపం చెంది స్వగ్రామంలోని ఆయన ఇంట్లో ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News February 22, 2026

కరెంటు సమస్యలా? ఈ నంబర్‌కు HI అని మెసేజ్ చేయండి

image

TGSPDCL వాట్సాప్ చాట్‌బోట్‌ను లాంచ్ చేసింది. 8712441912 నంబర్‌కు HI అని మెసేజ్ చేసి పలు సర్వీసులను పొందవచ్చు. కంప్లైంట్స్‌ రిజిస్టర్, కంప్లైంట్ ట్రాక్, బిల్ వివరాలు, పవర్ సప్లై స్టేటస్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే సమస్యపై ఏజెంట్‌తో చాట్ చేయొచ్చు. 24/7 ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.
#ShareIt

News February 22, 2026

పార్వతీపురం: PGRS అర్జీల వివరాల ‘మీ కోసం’

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు ‘మీ కోసం’ వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరిస్తామన్నారు.