News February 21, 2026

3 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి

image

ఖమ్మం: గత 12 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం జరగలేదని, ఈ ఏడాది రాష్ట్రానికి 3 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని కోరారు. శనివారం కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం కేంద్రాన్ని నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం గుర్తించిన 11.57 లక్షల మంది అర్హులకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Similar News

News February 21, 2026

చీపురు పట్టిన నంద్యాల కలెక్టర్

image

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని గుర్తు చేయాల్సిన అవసరం ఉందని నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని శుభ్రత పనులను పరిశీలించారు. అనంతరం చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. జీవిత విధానంలో శుభ్రతను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు.

News February 21, 2026

వికసిత్ భారత్‌కు ‘మేడ్ ఇన్ ఇండియా చిప్స్’ కీలకం: మోదీ

image

IND అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి స్వయంసమృద్ధి సాధించడం కీలకమని PM మోదీ తెలిపారు. ఫాక్స్‌కాన్, HCL యూపీలో ఏర్పాటుచేయనున్న సెమీకండక్టర్ పరిశ్రమకు వర్చువల్‌గా ఆయన శంకుస్థాపన చేశారు. ‘కరోనా టైమ్‌లో చిప్‌ల సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో అనేక ఆర్థిక వ్యవస్థలు ప్రభావితమయ్యాయి. వికసిత్ భారత్‌కు మేడ్ ఇన్ ఇండియా చిప్స్ ముఖ్యం. ఈ దశాబ్దంలో నిర్ణయాలు 21వ సెంచరీలో సామర్థ్యాలకు పునాదులవుతాయి’ అని పేర్కొన్నారు.

News February 21, 2026

‘వన్ హెల్త్’ ప్రాజెక్టుకు సంగారెడ్డి జిల్లా ఎంపిక

image

ప్రతిష్టాత్మక ‘వన్ హెల్త్’ పైలట్ ప్రాజెక్టుకు సంగారెడ్డి జిల్లా ఎంపికైనట్లు DMHO డాక్టర్ వసంతరావు తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర బృందం ఈ నెల 23, 24 తేదీల్లో జిల్లాలో పర్యటించనుందని వెల్లడించారు. పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.