News August 31, 2025
రూ.21వేల కోట్లతో కట్టిన 3 బ్యారేజీలు వృథా: మంత్రి

TG: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీరు నిల్వ చేయకున్నా పంటలకు నీరిచ్చామని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో చెప్పారు. కాళేశ్వరం కూలిన తర్వాత ధాన్యం ఉత్పత్తిలో నం.1 అయ్యామన్నారు. కాళేశ్వరానికి రూ.87,449 కోట్లు ఖర్చు చేస్తే, రూ.21వేల కోట్లతో కట్టిన 3 బ్యారేజీలు పూర్తిగా నిరుపయోగంగా మారాయని విమర్శించారు. తాము ఎక్కడా కక్ష సాధింపు ధోరణితో వెళ్లలేదని, పారదర్శకంగా విచారణ చేయించామని చెప్పారు.
Similar News
News August 31, 2025
జింబాబ్వే పాలిట సింహస్వప్నంగా నిస్సాంక

జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో శ్రీలంక క్రికెటర్ పాతుమ్ నిస్సాంక చెలరేగుతున్నారు. తొలి వన్డేలో 76 పరుగులు బాదిన ఆయన రెండో మ్యాచులో 122 రన్స్‌తో విరుచుకుపడ్డారు. అంతకుముందు ZIMతో జరిగిన వన్డేల్లోనూ ఆయన 75, 16, 55, 101 పరుగులు బాదారు. కాగా నిస్సాంక అరంగేట్రం (2021) నుంచి వన్డేల్లో అత్యధిక పరుగులు బాదిన ఓపెనర్‌గా (2,648) నిలిచారు. తర్వాత గిల్(2,476), ఒడౌడ్(2,008), రోహిత్ శర్మ (1,990) ఉన్నారు.
News August 31, 2025
జగన్‌కు ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఫోన్

AP: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి YS జగన్‌కు ఫోన్ చేసినట్లు వైసీపీ ట్వీట్ చేసింది. కానీ ముందుగానే NDA అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మాట ఇచ్చినట్లు జగన్ తెలిపారని పేర్కొంది. మద్దతు ఇవ్వలేకపోతున్నందుకు అన్యధా భావించవద్దని కోరినట్లు చెప్పింది. సుదర్శన్ రెడ్డి న్యాయవ్యవస్థ ద్వారా ప్రజలకు అపార సేవలు అందించారని కొనియాడినట్లు వివరించింది.
News August 31, 2025
రూ.1.27 లక్షల కోట్ల ప్రజాధనం వృథా: భట్టి

TG: కాళేశ్వరం ప్రాజెక్టుతో వాడుకున్న నీళ్ల కంటే ఎత్తిపోసి, వదిలేసినవే ఎక్కువ అని డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో అన్నారు. ‘రూ.27 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్ల నిర్మించి ఉంటే ఎంతో మేలు జరిగేది. బ్యారేజీల విషయంలో మా రిపోర్టుకు వ్యతిరేకంగా వెళ్లారని CWC చెప్పింది. రూ.1.27 లక్షల కోట్ల ప్రజాధనం వృథా చేయడం చిన్న విషయం కాదు. మేడిగడ్డలో లోపాలు ఉన్నాయని BRS హయాంలోనే NDSA చెప్పింది’ అని తెలిపారు.