News October 16, 2025
సెమీస్‌లో 3 బెర్తులు.. పోటీలో నాలుగు జట్లు!

WWC సెమీస్ రేస్ రసవత్తరంగా సాగుతోంది. ఇవాళ బంగ్లాపై విజయంతో AUS సెమీస్‌కు దూసుకెళ్లింది. మిగిలిన 3 స్థానాల కోసం ప్రధానంగా 4 జట్ల మధ్యే పోటీ ఉండనుంది. పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్‌లో చివరి 3 స్థానాల్లో ఉన్న బంగ్లా(2), శ్రీలంక (2), పాక్(1) దాదాపు రేస్ నుంచి తప్పుకున్నట్లే. ENG(7), SA(6), IND(4), NZ(3) పోటీ పడనున్నాయి. పాయింట్స్‌తో పాటు రన్‌రేట్ కీలకం కానుంది. మీ ప్రిడిక్షన్ కామెంట్ చేయండి.
Similar News
News October 17, 2025
తాజా సినీ ముచ్చట్లు

*బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కంధపురి’ ఇవాళ ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ 5’లో స్ట్రీమింగ్ కానుంది.
*ఈనెల 31న విడుదలయ్యే ‘బాహుబలి ది ఎపిక్’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి 3 గంటల 44 నిమిషాల రన్‌టైమ్‌ను లాక్ చేశారు.
*ఇవాళ ‘తెలుసు కదా’, ‘డ్యూడ్’ చిత్రాలు థియేటర్లలో విడుదలయ్యాయి. దేనికి వెళ్తున్నారు?
News October 17, 2025
విశాఖలో పెట్టుబడికి మరో సంస్థ ఆసక్తి

AP: నిర్మాణ సంస్థ కె.రహెజా విశాఖలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. IT సంస్థలకు అవసరమైన వాణిజ్య, నివాస భవనాలు నిర్మించేందుకు ఆసక్తి చూపుతోంది. రూ.2,172కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నామని, మధురవాడలో 27 ఎకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 9,681మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. ఇటీవల విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
News October 17, 2025
అజిత్రోమైసిన్ సిరప్‌లో పురుగులు

మధ్యప్రదేశ్‌లో దగ్గు మందు మరణాల తర్వాత అజిత్రోమైసిన్ సిరప్‌లో పురుగులు రావడం కలకలం రేపుతోంది. గ్వాలియర్ జిల్లా మోరార్ ప్రభుత్వాస్పత్రిలో ఇచ్చిన అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ సిరప్‌లో పురుగులున్నాయని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రిలోని మిగిలిన 306 బాటిల్స్‌ను సీజ్ చేసి, టెస్ట్ కోసం శాంపిల్స్ భోపాల్ పంపారు. అది జనరిక్ మెడిసిన్ అని, MPలోని ఓ కంపెనీ తయారు చేస్తోందని అధికారులు వెల్లడించారు.