News January 13, 2025

కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే <<15137555>>కౌశిక్ రెడ్డిపై<<>> 3 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారని, సమావేశంలో గందరగోళం సృష్టించారని ఆర్డీవో, గ్రంథాలయ ఛైర్మన్, సంజయ్ పీఏ వేర్వేరుగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు 3 కేసులను నమోదు చేశారు. నిన్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సందర్భంగా ‘నీది ఏ పార్టీ?’ అంటూ సంజయ్‌ను కౌశిక్ నిలదీయడంతో తోపులాట జరిగిన సంగతి తెలిసిందే.

Similar News

News January 13, 2025

గత పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలి: KCR

image

ఉమ్మడి రాష్ట్రంలో దండుగన్న తెలంగాణ వ్యవసాయం, BRS హయాంలో పండుగలా మారిందని మాజీ సీఎం KCR పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఆయన, రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగాలని కోరారు. తమ పదేళ్ల పాలనలో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి దాదాపు ₹4.5లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. రాజకీయాలకు అతీతంగా, రాజీపడకుండా గత పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు.

News January 13, 2025

PHOTO: ఇందిరమ్మ ఇల్లు ఇలాగే ఉంటుంది!

image

TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్‌ను ఆవిష్కరించారు. నెల రోజుల్లో దీన్ని నిర్మించారు. ఇందులో హాల్, కిచెన్, బెడ్ రూం (అటాచ్డ్ బాత్‌రూం) ఉంటాయి. ఈ స్కీంలో భాగంగా ఒక్క ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు ఇస్తుంది. జనవరి 26 నుంచి ఈ ఇళ్లు కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామని చెప్పారు.

News January 13, 2025

రూ.582 కోట్లతో తెలంగాణ ప్రభుత్వ స్టార్ హోటల్.. త్వరలో నిర్మాణం!

image

TG: హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని రాయదుర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ-గ్రేడ్‌ ట్రేడ్‌ సెంటర్‌‌తో కూడిన ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను నిర్మించనుంది. 3 ఎకరాల్లో ₹582 కోట్లతో 15 అంతస్తుల భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది. వరల్డ్‌లోనే టాప్-10లో ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో బిల్డ్ చేయనుంది. ఇప్పటికే బిడ్డర్ల నుంచి టెండర్లు ఆహ్వానించింది. 36 నెలల్లో హోటల్‌ను అందుబాటులోకి తేవాలని పేర్కొంది.