News April 6, 2025
వరుసగా 3 రోజులు సెలవులు

TG: ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాలు, పలు విద్యాసంస్థలకు ఈనెల 12 నుంచి 14 వరకు వరుసగా సెలవులు రానున్నాయి. 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవులు ఉండనున్నాయి. అటు ఈనెల 10న మహావీర్ జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలీడే ఉంది. 18న గుడ్ ఫ్రైడే రోజు సెలవు ఉండనుండగా, 30న బసవ జయంతి రోజున ప్రభుత్వం ఆప్షనల్ సెలవుగా పేర్కొంది.
Similar News
News January 3, 2026
దావోస్, యూఎస్ పర్యటనకు సీఎం రేవంత్!

TG: పెట్టుబడుల సమీకరణ కోసం సీఎం రేవంత్ ఈ నెల 19న స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటించనున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారీ అక్కడ జరిగే పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. అనంతరం అమెరికా పర్యటనకు వెళ్తారని సమాచారం. ఈ టూర్ షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. ఇది ఫిక్స్ అయితే ఆయన ఫిబ్రవరి 1న హైదరాబాద్ తిరిగి వస్తారని సమాచారం.
News January 3, 2026
నవగ్రహ ప్రదక్షిణలో పఠించాల్సిన మంత్రం

“ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:”
నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తే.. మనసు ఏకాగ్రతతో నిండి, గ్రహాల అనుగ్రహం వేగంగా లభిస్తుంది. సూర్యుడు మొదలుకొని కేతువు వరకు తొమ్మిది గ్రహాలను స్మరిస్తూ చేసే ఈ ప్రార్థన జాతక దోషాలను హరిస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. అలాగే గ్రహ గతులు అనుకూలించి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది.
News January 3, 2026
జీడిమామిడిలో వచ్చిన కాయలు నిలబడాలంటే?

జీడిమామిడిలో పూత తర్వాత వచ్చిన కాయలు చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతుంటాయి. చాలా తోటల్లో ఇది కనిపిస్తుంది. ఈ సమస్య తగ్గి కొత్తగా వచ్చిన కాయలు నిలబడాలంటే 19-19-19 లేదా మల్టికే(13-0-45)ను లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి కాయలు తడిచేలా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కాయలు మొక్కలపై నిలబడి, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.


