News March 17, 2024

500 కుటుంబాల అభివృద్ధికి రూ.3కోట్లు: ఎంపీ బాలశౌరి

image

ట్రైబల్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ కింద నాగాయలంక, కోడూరు మండలాల్లోని 500 కుటుంబాలకు లబ్ధి చేకూరేలా నాబార్డ్ ఛైర్మన్‌తో మాట్లాడి రూ.3 కోట్లు మంజూరు చేయించినట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. ఈ మేరకు ఆదివారం గుంటూరులోని కార్యాలయం నుంచి ప్రకటనలో పేర్కొన్నారు. ఆ నిధులతో ఆ కుటుంబాలకు బోట్లు, చేపలు పట్టే వలలు, మహిళలకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా చేపల ఫీడ్ తయారు చేసే మిషన్లు ఇతర పరికరాలు కొనుగోలు చేసి ఇస్తామని చెప్పారు.

Similar News

News January 23, 2026

గుంటూరు: ‘వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం’

image

గుంటూరు జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో UPHCలు, PHCలలో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించినట్లు DMHO విజయలక్ష్మి తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డీఈఓ, ఎఫ్‌ఎన్‌వో, శానిటరీ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 2 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫారములు వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలు www.guntur.ap.gov.in‌లో అందుబాటులో ఉన్నాయి.

News January 23, 2026

పొన్నూరు విద్యార్థికి రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్

image

గుంటూరు జోనల్ స్థాయిలో గురువారం జరిగిన స్పెల్ బీ పోటీలలో పొన్నూరు విద్యార్థి పొట్లూరి దేవేశ్ ప్రథమ స్థానంలో నిలిచాడు. పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న దేవేశ్ జోనల్ స్థాయిలో ప్రథమ స్థానం పొంది రాష్ట్రస్థాయిలో 4వ తరగతి విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో విద్యార్థి దేవేశ్‌ను మండల విద్యాశాఖ అధికారులు ధూపం రాజు, కొల్లి విజయభాస్కర్, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు అభినందించారు.

News January 23, 2026

గుంటూరు ప్రజలకు ఎస్పీ ముఖ్య సూచన

image

గుంటూరు జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని SP వకుల్ జిందాల్ సూచించారు. సీనియర్ సిటీజన్స్, విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారుల మాదిరిగా కొందరు ఫోన్లు చేసి కేసులు నమోదైనట్లు బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. అనుమానస్పద ఫోన్లు వస్తే వెంటనే కట్ చేసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని అన్నారు. వాట్సప్‌లో వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు.