News June 28, 2024

కేసీఆర్‌తో కార్యకర్తల భేటీకి 3 రోజులు బ్రేక్

image

TG: కేసీఆర్ గత 15 రోజులుగా ఎర్రవెల్లిలో నిరంతరాయంగా పార్టీ కార్యకర్తలతో భేటీ అవుతున్నారని బీఆర్ఎస్ తెలిపింది. ఆయనతో ప్రజల ఆత్మీయ సమావేశాలకు శనివారం నుంచి సోమవారం వరకు 3 రోజుల పాటు విరామం ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. పార్టీ నేతలతో కీలక సమావేశాలున్న నేపథ్యంలో పార్టీ నుంచి మరో ప్రకటన వచ్చే వరకూ ఎవరూ తనను కలవడానికి రావొద్దని కేసీఆర్ కోరారని పేర్కొంది.

Similar News

News December 10, 2025

అమెజాన్ భారీ పెట్టుబడులు.. 10 లక్షల ఉద్యోగాలు

image

ఇండియాలో ఈ-కామర్స్ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని అమెజాన్ మరో 35 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి 10 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది. మరోవైపు ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తుల ఈ-కామర్స్ ఎగుమతులను $80B వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌‌ను కీలకమైన మార్కెట్‌గా భావిస్తోన్న అమెజాన్.. ఇప్పటివరకు మన దేశంలో దాదాపు 40B డాలర్ల పెట్టుబడి పెట్టింది.

News December 10, 2025

మీరేం చేస్తున్నారు?: కేంద్రంపై మండిపడ్డ ఢిల్లీ HC

image

ఇండిగో విషయంలో కేంద్రం స్పందనపై ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ప్రయాణికుల కోసం ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలేంటి?’ అని ప్రశ్నించింది. అటు ఇదే టైమ్ అని ఇతర సంస్థలు డొమెస్టిక్ ఛార్జీలు ₹40వేలకు పెంచడాన్ని తప్పుబట్టింది. వారిని కట్టడి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేయగా నోటీస్ ఇవ్వడంతో సారీ చెప్పాయని ప్రభుత్వ లాయర్ బదులిచ్చారు. దీంతో మీరు సరిగా స్పందిస్తే ఈ పరిస్థితి వస్తుందా? అని నిలదీసింది.

News December 10, 2025

బొప్పాయిలో తెగుళ్ల నివారణకు సూచనలు

image

నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. విత్తన శుద్ధి తప్పక చేసుకోవాలి. నర్సరీల నుంచి మొక్కలను తీసుకుంటే వైరస్ తెగుళ్ల లక్షణాలు లేకుండా చూసుకోవాలి. ఏదైనా మొక్కలో వైరస్ తెగులు లక్షణాలు కనిపిస్తే దాన్ని పంట నుంచి తీసేసి దూరంగా కాల్చివేయాలి. తోటలో ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. బొప్పాయి నారు మొక్కలను పొలంలో నాటే 3 రోజుల ముందే లీటరు నీటికి 1.5గ్రా. అసిఫేట్ కలిపి పిచికారీ చేయాలి.