News May 24, 2024
బ్లాక్‌లిస్టులో 3 ఈవీ కంపెనీలు?

ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు హీరో ఎలక్ట్రిక్, ఒకినావా, బెన్లింగ్లను కేంద్రం బ్లాక్‌లిస్ట్ చేసే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఫేమ్-2 స్కీమ్ కింద తప్పుడు క్లెయిమ్‌లతో ఈ సంస్థలు ప్రయోజనాలు పొంది.. తిరిగి ఇవ్వలేదు. ఫేమ్-2 కింద స్థానికంగా విడిభాగాలు సేకరించకుండా, దిగుమతి చేసుకున్న వాటితో వాహనాలను రూపొందించాయని ఈ సంస్థలపై ఆరోపణలున్నాయి.
Similar News
News October 30, 2025
అభ్యంగ స్నానంతో ఎన్నో ప్రయోజనాలు

వారానికోసారి అభ్యంగన స్నానం చేయాలని ఆయుర్వేద శాస్త్రం సూచిస్తుంది. తైలాభ్యంగం ముఖ్యమని చెబుతోంది. స్పర్శేంద్రియమైన చర్మంలోనే ఈ శరీరం ఉంటుంది. అందువల్ల నూనె లేపనం శరీరానికి బలం, కాంతిని ఇస్తుంది. శిరస్సు నందు అభ్యంగనం వల్ల ఇంద్రియాలు తృప్తి చెందుతాయి. దృష్టి దోషాలు తొలగి, శిరో రోగాలు నశిస్తాయి. అవయవాలకు బలం చేకూరుతుంది. పాదాల పగుళ్లు తగ్గుతాయి. నిద్ర బాగా పడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
News October 30, 2025
ఇంటర్వ్యూతో IRCTCలో 64 ఉద్యోగాలు

IRCTC 64 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. BSc(హాస్పిటాలిటీ), BBA/MBA, BSc(హోటల్ మేనేజ్మెంట్& క్యాటరింగ్ సైన్స్), MBA(టూరిజం& హోటల్ మేనేజ్మెంట్) అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థులు గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ వివిధ ప్రాంతాల్లో నవంబర్ 8 నుంచి 18 వరకు నిర్వహిస్తారు. వెబ్సైట్: https://irctc.com
News October 30, 2025
అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఆఫర్.. సీఎంపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు!

TG: మంత్రివర్గ విస్తరణను వెంటనే ఆపేలా ఆదేశించాలని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఆఫర్ చేసి సీఎం రేవంత్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించారంటూ అందులో పేర్కొంది. ఇది నియోజకవర్గంలోని ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని ఆరోపించింది. ఎన్నికల నిబంధన ఉల్లంఘించిన సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.


