News March 6, 2025
గంటకు 3 లక్షల కి.మీ.. నెలలోపే మార్స్‌పైకి

రష్యా ఓ అద్భుత రాకెట్ ఇంజిన్‌ను ఆవిష్కృతం చేసింది. మార్స్‌పైకి వెళ్లేందుకు అత్యంత వేగవంతమైన ప్లాస్మా ఎలక్ట్రిక్ రాకెట్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసింది. ఇది గంటకు 3,13,822 కి.మీ వేగంతో నింగిలోకి దూసుకెళ్తుంది. దాదాపు 30 నుంచి 60 రోజుల్లోనే ఇది అంగారకుడిపైకి చేరుకుంటుంది. 2030 నాటికి దీనిని పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని రష్యా ప్రభుత్వ సంస్థ న్యూక్లియర్ కార్పొరేషన్ రోసాటామ్ భావిస్తోంది.
Similar News
News November 21, 2025
ఇంటలెక్చువల్ టెర్రరిస్టులు మరింత ప్రమాదం: ఢిల్లీ పోలీసులు

టెర్రరిస్టుల కంటే వారిని నడిపిస్తున్న ఇంటలెక్చువల్స్ మరింత ప్రమాదకరమని సుప్రీంకోర్టులో ASG రాజు చెప్పారు. డాక్టర్లు, ఇంజినీర్లు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం ట్రెండ్‌గా మారిందన్నారు. 2020 ఢిల్లీ అల్లర్లు, నవంబర్ 10 రెడ్‌ఫోర్ట్ పేలుళ్లే ఉదాహరణలని గుర్తుచేశారు. విచారణ ఆలస్యాన్ని కారణంగా చూపిస్తూ నిందితులు బెయిల్ కోరుతున్నారన్నారు. ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసుల తరఫున ASG వాదనలు వినిపించారు.
News November 21, 2025
23న పెళ్లి.. స్మృతికి మోదీ గ్రీటింగ్స్

స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 23న ఆమె తన ప్రియుడు పలాశ్ ముచ్చల్‌తో ఏడడుగులు వేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మంధాన-ముచ్చల్ జోడీకి గ్రీటింగ్స్ తెలుపుతూ లేఖ రాశారు. వివాహ బంధంలో ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కాగా స్మృతి-పలాశ్ ఎంగేజ్మెంట్ ఇప్పటికే పూర్తయింది.
News November 20, 2025
ఎగుమతులకు రష్యా చమురు కొనుగోలు చేయం: రిలయన్స్

రష్యా నుంచి కొనుగోలు చేయని చమురును మాత్రమే శుద్ధి చేసి ఎగుమతి చేస్తామని రిలయన్స్ వెల్లడించింది. ఎగుమతులకు ఉపయోగించే చమురు కొనుగోళ్లను నేటి నుంచి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి రష్యా నుంచి కొనుగోలు చేయని చమురును మాత్రమే శుద్ధి చేసి ఎగుమతి చేయనున్నట్టు తెలిపింది. అయితే, భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగుతాయని రిలయన్స్ ప్రతినిధి తెలిపారు.


