News February 22, 2025

డేటా ఇంజినీరింగ్‌లో 3 నెలలు ఉచిత శిక్షణ: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: డేటా ఇంజినీరింగ్‌లో 90 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. టాస్క్, శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుందని పేర్కొన్నారు. 2021 నుంచి 2024 మధ్యలో బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. మార్చి 1 లోపు <>అప్లై<<>> చేసుకోవాలన్నారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి నియామకాలు కల్పిస్తామని చెప్పారు.

Similar News

News January 23, 2026

బ్రెజిల్‌తో భాగస్వామ్యం కొత్త శిఖరాలకు: మోదీ

image

బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ‘కొత్త శిఖరాలను అధిరోహించడానికి సిద్ధంగా ఉన్న IND-బ్రెజిల్ భాగస్వామ్యంపై సమీక్షించాం. గ్లోబల్ సౌత్ ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి మా సహకారం చాలా ముఖ్యం’ అని ట్వీట్ చేశారు. ‘FEB 19-21 మధ్య నా ఢిల్లీ పర్యటనపై డిస్కస్ చేశాం. భౌగోళిక పరిస్థితులు, గాజాలో శాంతి స్థాపన, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించాం’ అని లూలా పేర్కొన్నారు.

News January 23, 2026

జనవరి 23: చరిత్రలో ఈరోజు

image

1897: స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జననం
1911: హైదరాబాద్ తొలి మహిళా మేయర్ రాణీ కుముదినీ దేవి జననం
1915: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థర్ లూయీస్ జననం
1926: శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ ఠాక్రే జననం
2015: హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ మరణం (ఫొటోలో)

News January 23, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.