News August 7, 2025
ఇన్‌స్టాగ్రామ్‌లో 3 కొత్త ఫీచర్స్

ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. పబ్లిక్‌గా ఉన్న రీల్స్, ఫీడ్ పోస్టులను రీపోస్ట్ చేసే ఆప్షన్‌ను తీసుకొచ్చారు. అలాగే యూజర్ తన ప్రజెంట్ లొకేషన్‌ను ఫ్రెండ్స్‌కు షేర్ చేసేలా ‘మ్యాప్’ ఫీచర్ తీసుకొచ్చారు. ఫ్రెండ్స్ లైక్ & కామెంట్ లేదా రీపోస్ట్ చేసిన రీల్స్ చూసేందుకు ‘ఫ్రెండ్స్’ అనే ట్యాబ్ తీసుకొచ్చారు. మూడు ఫీచర్లు క్రమంగా అందరికీ అందుబాటులోకి రానున్నాయి.
Similar News
News August 10, 2025
ఇవాళ్టి నుంచి తిరంగా యాత్రలు: మాధవ్

AP: ఇవాళ్టి నుంచి 14 వరకు తిరంగా యాత్రలు నిర్వహించాలని BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను శుభ్రం చేసి, వారి కుటుంబ సభ్యులతో కలిసి చిత్రపటాలకు నివాళులు అర్పించాలని సూచించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు బీజేపీ శ్రేణులు తమ ఇళ్లపై కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ జెండా ఎగురవేయాలని, 15న బహిరంగ ప్రదేశాల్లో జెండా ఆవిష్కరణల్లో పాల్గొనాలని పేర్కొన్నారు.
News August 10, 2025
కేటీఆర్ Vs కవిత.. రాఖీపే చర్చ!

TG: రాఖీ వేళ KTR, కవిత మధ్య దూరం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘అన్నా.. రాఖీ కట్టడానికి రానా?’ అని ఆమె మెసేజ్ చేయగా, ఆయన చాలా ఆలస్యంగా ‘నేను ఔట్ ఆఫ్ స్టేషన్’ అని రిప్లై ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ వైరం వల్ల కొంతకాలంగా అన్నాచెల్లెళ్ల మధ్య మనస్పర్ధలొచ్చిన సంగతి బహిరంగ రహస్యమే. కానీ KTR కావాలనే అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఈ చర్చపై మీ COMMENT?
News August 10, 2025
అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు: భట్టి

TG: పంచాయతీ మొదలు సెక్రటేరియట్ వరకు అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తామని Dy.CM భట్టి విక్రమార్క వెల్లడించారు. వాటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. సోలార్ ప్యానళ్ల ఏర్పాటు, ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ అమలుపై కలెక్టర్లతో సమీక్షించారు. ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిజైన్లు, వివరాల కోసం ప్రశ్నావళిని పంపుతామన్నారు.