News May 10, 2024
3 నైట్షిఫ్టులతో తీవ్రస్థాయిలో డయాబెటిస్ ముప్పు

3 నైట్ షిఫ్టులు చేసినా డయాబెటిస్ ముప్పు గణనీయంగా పెరుగుతుందని అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘రాత్రుళ్లు పనిచేయడం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయుల్ని నియంత్రించే ప్రొటీన్ల పనితీరు అస్తవ్యస్తమవుతుంది. శరీరం పనితీరు దెబ్బ తిని మధుమేహం తలెత్తుతుంది. మనలో ఉండే బయోలాజికల్ క్లాక్ నియంత్రణ కోల్పోయి దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారి తీస్తుంది’ అని తమ నివేదికలో వారు తెలిపారు.
Similar News
News November 4, 2025
ఆలయాల్లో రద్దీ.. జాగ్రత్తలు

కార్తీకమాసం సందర్భంగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తొక్కిసలాటలు జరగకుండా కొన్ని జాగ్రత్తలు..
*క్యూలలో వ్యతిరేక దిశలో ప్రవేశించకూడదు
*ముందున్న భక్తులను నెట్టకూడదు
*పరుగు తీయడం లేదా తోసుకోవడం చేయొద్దు
*సిబ్బంది సూచనలు పాటించాలి. గుంపులుగా ఉండొద్దు.
*రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు దర్శనం కోసం సహనంతో వేచి ఉండాలి
*తొక్కిసలాట పరిస్థితులు కనిపించగానే దూరంగా వెళ్లాలి
News November 4, 2025
ఏపీ రౌండప్

* విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ అధీనంలోనే ఉందన్న కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
* ఎస్టీ కమిషన్ ఛైర్మన్గా బొజ్జిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
* ఇవాళ టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని.. కేంద్ర కార్యాలయానికి లోకేశ్
* రాష్ట్రంలో తుఫాను ప్రభావంతో 1,49,302 హెక్టార్లలో పంట నష్టం!  
News November 4, 2025
సమానత్వం అప్పుడే ఎక్కువ

మహిళలు అనునిత్యం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ ఇప్పటికీ కొన్నిచోట్ల సమానత్వం అన్నది పుస్తకాలకే పరిమితమైంది. అయితే పురాతన కాలంలోనే ఈజిప్టు మహిళల్ని పురుషులతో సమానంగా పరిగణించేవారట. వాళ్లకంటూ సొంత ఆస్తులు, విడాకులు తీసుకునే హక్కులతోపాటు మత, రాజకీయ పదవులూ కలిగి ఉండేవారని తొలి పురావస్తు రికార్డులు చెబుతున్నాయి.


