News August 7, 2025
ఇవాళ 3 పథకాలు ప్రారంభం

AP: చేనేత కార్మికుల కోసం 3 పథకాలను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది. కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ అందించే స్కీంను జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో CM చంద్రబాబు ప్రారంభిస్తారు. చేనేత దుస్తులపై 5% GST మినహాయింపు, చేనేతలకు హెల్త్ ఇన్సూరెన్స్‌పై CM ప్రకటించనున్నారు. ప్రభుత్వం సుమారు 2.5 లక్షల చేనేత కార్మికుల జీవనోపాధిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
Similar News
News August 7, 2025
విడాకుల ప్రచారంపై స్పందించిన నటి సంగీత

నటి సంగీత తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరును ‘సంగీత క్రిష్’ నుంచి ‘సంగీత యాక్టర్’గా మార్చుకున్నారని పలు సైట్లు వార్తలు ప్రచురించాయి. ఇటీవల హీరోయిన్ల గెట్ టుగెదర్‌కూ భర్త లేకుండానే వచ్చారని పేర్కొన్నాయి. అయితే ఈ వార్తలను సంగీత ఖండించారు. ‘ఆ ప్రచారంలో నిజం లేదు. నేను మొదటి నుంచి నా పేరును ఇన్‌స్టాలో సంగీత యాక్టర్ అని ఉంచుకున్నా’ అని తెలిపారు.
News August 7, 2025
ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాలు విడుదల

TG: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని, ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. గతేడాది 1,284 పోస్టులకు నోటిఫికేషన్ రాగా నవంబర్‌లో పరీక్ష నిర్వహించారు. 23,323 మంది ఈ ఎగ్జామ్ రాశారు. ఫలితాల కోసం ఇక్కడ <
News August 7, 2025
జస్టిస్ వర్మ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

జస్టిస్ యశ్వంత్ వర్మ రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. తన ఇంట్లో భారీగా డబ్బు లభ్యమైన ఘటనలో ఆరోపణలకు సంబంధించి త్రిసభ్య కమిటీ ఇచ్చిన అంతర్గత విచారణ నివేదికను కొట్టేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు చట్ట ప్రకారమే కమిటీ విచారణ చేపట్టిందని, పిటిషనర్ ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలగలేదని పేర్కొంది. రిట్ పిటిషన్ కొట్టేస్తున్నట్లు తీర్పిచ్చింది.