News August 9, 2024

భూమిని ఢీకొట్టనున్న 3 సౌర తుఫాన్లు..!

image

సూర్యుడి నుంచి ఈ నెల 7, 8 తేదీల్లో వెలువడిన 3 తీవ్రస్థాయి సౌర తుఫాన్లు వచ్చే 2 రోజుల్లో భూమిని తాకనున్నాయి. అవి సెకనుకు వెయ్యి కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నాయని సోలార్ అండ్ హీలియోస్ఫెరిక్ అబ్జర్వేటరీ తెలిపింది. ఉపగ్రహాలు, కమ్యూనికేషన్స్, పవర్ గ్రిడ్స్‌పై వీటి ప్రభావం ఉండొచ్చంది. వీటిలో మూడో తుఫాను కేటగిరీ-3 స్థాయిదని వివరించింది. సాంకేతిక మౌలిక వసతుల విషయంలో ముందుగా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చింది.

Similar News

News January 28, 2026

ఆధార్ యాప్ వచ్చేసింది!

image

ఆధార్ సేవల్లో విప్లవాత్మక మార్పులు చేస్తూ UIDAI కొత్త అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇకపై ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఆధార్ <<18974342>>యాప్<<>> ద్వారానే మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తెచ్చింది. ‘డిజిటల్ ఐడెంటిటీ’ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రయాణాల్లో ఫిజికల్ కాపీలు అవసరం లేకుండానే వెరిఫై చేసేలా మార్పులు చేసింది. ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్ పనులకు ఇది కీలకం కానుంది.

News January 28, 2026

T20 వరల్డ్ కప్‌లో ఆడాల్సిందే: పాక్ మాజీలు

image

బంగ్లాదేశ్‌కు మద్దతుగా T20 WCను <<18966853>>బహిష్కరించాలని<<>> పాకిస్థాన్ యోచిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పీసీబీ చీఫ్ నఖ్వీకి వ్యతిరేకంగా పాక్ మాజీలు గొంతు విప్పుతున్నారు. టోర్నీకి వెళ్లకపోతే పాక్‌కే నష్టమని హెచ్చరిస్తున్నారు. WCకు జట్టును పంపాలని ఇంజమామ్ ఉల్ హక్, మహ్మద్ హఫీజ్, మొహ్సిన్ ఖాన్, రషీద్ సూచించారు. ఐసీసీతో సంబంధాలు చెడగొట్టుకుని ఏం సాధిస్తారని పీసీబీ మాజీ కార్యదర్శి అబ్బాసీ ప్రశ్నించారు.

News January 28, 2026

బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్టీలు సైలెంట్ 1/2

image

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లపై పార్టీలు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లాయి. రిజర్వేషన్ల బిల్లు పెండింగ్‌లో ఉండడంతో పార్టీ పరంగా ఆమేరకు సీట్లు ఇస్తామని అవి ఇంతకు ముందు ప్రకటించాయి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ పార్టీ గుర్తులతో జరుగుతున్నా స్పందించడం లేదు. అధికారికంగా 32% సీట్లు BCలకు వస్తున్నందున అదనపు సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నాయి. వాటి తీరుపై BCల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.