News January 19, 2025

3 టెస్టులు, 60 వికెట్లు.. మొత్తం స్పిన్నర్లకే

image

ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో WIపై 127 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. పాకిస్థాన్ గడ్డపై బంతుల పరంగా ఇదే షార్టెస్ట్ టెస్టు మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌ 4 ఇన్నింగ్సుల్లో 1,064 బంతులను బౌలర్లు వేశారు. 1990లో WI-PAK మ్యాచ్‌లో 1,080 బంతులు డెలివరీ అయ్యాయి. అలాగే వరుసగా 3 హోం టెస్టుల్లో పాక్ స్పిన్నర్లు 60 వికెట్లు కూల్చేయడం మరో విశేషం. పేసర్లకు ఒక్కటీ దక్కలేదు.

Similar News

News December 28, 2025

U-19 కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ

image

చిన్న వయసులోనే తన టాలెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్ సూర్యవంశీ మరో ఘనత సాధించారు. కేవలం 14ఏళ్ల వయసులోనే దక్షిణాఫ్రికా U-19తో జరిగే 3 వన్డేల సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. U-19 వరల్డ్ కప్‌కు ముందు జరిగే ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో BCCI వైభవ్‌కు బాధ్యతలు అప్పగించింది. జనవరి 3 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది.

News December 28, 2025

జగన్ అంతా తెలుసు అనుకుంటారు: లోకేశ్

image

AP: PPP విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని YCP వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ ఓ వార్తను రీట్వీట్ చేస్తూ Ex.CM జగన్‌కు చురకలంటించారు. ‘కేంద్రం, సీనియర్ ఎడిటర్స్, డొమైన్ ఎక్స్‌పర్ట్స్ అంతా వైద్య విద్యలో సామర్థ్యాన్ని పెంచేందుకు PPP విధానం సరైందని నమ్ముతున్నారు. కానీ, మన విధ్వంసక ప్రతిపక్ష నాయకుడు మాత్రం అందరికంటే తనకే ఎక్కువ తెలుసు అనుకుంటారు’ అని ట్వీట్ చేశారు.

News December 28, 2025

లంకతో మ్యాచ్.. టాస్ ఓడిన భారత్

image

భారత మహిళల జట్టుతో జరిగే 4వ టీ20లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
INDW: షెఫాలీ, స్మృతి మంధాన, హర్లీన్, హర్మన్‌ప్రీత్(C), రిచా ఘోష్, దీప్తిశర్మ, అమన్‌జోత్, అరుంధతి రెడ్డి, వైష్ణవి, రేణుకా సింగ్, శ్రీచరణి.
SLW: హాసిని పెరెరా, చమరి ఆటపట్టు(C), హర్షిత, కవిషా దిల్హరి, ఇమేషా దులానీ, నీలక్షికా సిల్వా, కౌషని, మల్షా, రష్మిక సెవ్వండి, కావ్య, నిమేషా.