News May 28, 2024

భారత్ కోచ్ పదవికి 3వేల దరఖాస్తులు

image

భారత జట్టు కోచ్ పదవి కోసం BCCIకి 3వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. మోదీ, అమిత్ షా, సచిన్ టెండూల్కర్, ధోనీ వంటి సెలబ్రిటీల పేర్లతోనూ అప్లికేషన్లు వచ్చినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. అయితే వీటిలో చాలా వరకు నకిలివే ఉన్నట్లు తెలుస్తోంది. 2022లోనూ 5వేల అప్లికేషన్లు రాగా, వాటిలో ఎక్కువగా ఫేక్ అని గుర్తించారు. కాగా నిన్నటితో కోచ్ పదవికి దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే.

Similar News

News February 21, 2026

మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. 15 శాతానికి టారిఫ్స్

image

ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్లోబల్ టారిఫ్స్‌ను 10 నుంచి 15 శాతానికి పెంచారు. దశాబ్దాలుగా USను పలు దేశాలు దోచుకున్నాయని పేర్కొన్నారు. రాబోయే కొద్ది నెలల్లో చట్టబద్ధంగా అనుమతించదగిన సుంకాలను నిర్ణయించి అమలు చేస్తామన్నారు. కాగా ప్రపంచ దేశాలపై టారిఫ్స్ వేసే హక్కు అధ్యక్షుడికి లేదని US సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై మండిపడిన ట్రంప్ కొద్ది గంటల కిందటే 10% టారిఫ్స్ విధించిన విషయం తెలిసిందే.

News February 21, 2026

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 10 మంది మృతి

image

లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూపులే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో సీనియర్ ఫీల్డ్ కమాండర్ సహా 10 మంది మరణించగా 50 మందికి గాయాలయ్యాయి. ఇరు దేశాల మధ్య 2024 నవంబర్‌లో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే అతిపెద్ద దాడి అని అంతర్జాతీయ మీడియా వెల్లడించాయి. తమ దేశంపై దాడులకు ప్రణాళికలు వేస్తున్నారనే పక్కా సమాచారంతోనే రివర్స్ అటాక్ చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

News February 21, 2026

రైతు బంధు నిధులు ఎక్కడ: హరీశ్ రావు

image

TG: రైతుబంధు పేరు చెప్పి ఓట్లు వేయించుకున్నారని, కానీ ఇంతవరకు నిధులు విడుదల చేయలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రైతుబంధు ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటం చేస్తామన్నారు. సీఎం, వ్యవసాయశాఖ మంత్రి ఆఫీసులను ముట్టడిస్తామని చెప్పారు. అటు మెదక్ మున్సిపాలిటీలో BRS కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారని మండిపడ్డారు. పోలీసులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.