News September 18, 2024
వారికి రూ.3వేల నిరుద్యోగ భృతి!

AP: రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్నవారికి రూ.3,000 నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిరుద్యోగుల వివరాలను పంపాలని అన్ని జిల్లాల దేవాదాయశాఖ అధికారులకు ఎండోమెంట్ కమిషనర్ ఈ నెల 17న మెమో పంపినట్లు సమాచారం. అయితే ఆ మెమోలో ఈ నెల 16లోపు పంపాలని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Similar News
News March 13, 2025
తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం

త్రిభాషా వివాదం నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ కాపీపై రూపీ సింబల్(₹)ను తొలగించింది. రూపీ సింబల్‌కు బదులు తమిళ ‘రూ’ అక్షరాన్ని పేర్కొంది.
News March 13, 2025
KKR కెప్టెన్‌గా రహానే.. కారణం ఇదే

కెప్టెన్సీలో అనుభవం ఉన్న కారణంగానే తమ జట్టు కెప్టెన్‌గా రహానేను నియమించామని KKR CEO వెంకీ మైసూర్ తెలిపారు. ‘కెప్టెన్సీ అంటే ఒత్తిడి ఉంటుంది. అది యంగ్ ప్లేయర్లకు భారం. పైగా ఆక్షన్ తర్వాత జరిగే సీజన్ కాబట్టి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. అలాగే ప్లేయర్ల నుంచి బెస్ట్‌ను రాబట్టగలగాలి. అందుకే అనుభవమున్న రహానేను ఎంచుకున్నాం. V అయ్యర్ కూడా కెప్టెన్సీ మెటీరియల్. అతను రహానే నుంచి నేర్చుకుంటారు’ అని పేర్కొన్నారు.
News March 13, 2025
గాంధీ కుటుంబంతో నాకు మంచి అనుబంధం: రేవంత్

TG: గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ చెప్పారు. తాను వారితో ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎవరో తెలియకుండానే PCC అధ్యక్షుడిగా, సీఎంగా ఎంపిక చేశారా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న నిర్మల గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కీలక పాత్ర పోషించారని, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణ అంశాలను పట్టించుకోవట్లేదని విమర్శించారు.