News November 26, 2024
30కి కృష్ణా జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా
కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేపథ్యంలో ఈనెల 27వ తేదీన జరగాల్సిన సమావేశాన్ని 30వ తేదీకి మార్చారు. ఈ మేరకు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక ఓ ప్రకటన విడుదల చేశారు. 30న జరిగే సమావేశానికి సభ్యులంతా విధిగా హాజరు కావాలని కోరారు.
Similar News
News December 12, 2024
మచిలీపట్నం: మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం
రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం నెలకొంది. మంత్రి రవీంద్ర సోదరుడు కొల్లు వెంకట రమణ (64) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. గుండెపోటుకు గురైన వెంకట రమణను హుటాహుటిన ఆంధ్ర ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సోదరుడి మరణ వార్త తెలుసుకున్న మంత్రి రవీంద్ర విజయవాడ నుండి మచిలీపట్నం బయలుదేరారు. మరికాసేపట్లో మంత్రి మచిలీపట్నం రానున్నారు.
News December 11, 2024
మచిలీపట్నం: పేర్ని నాని సతీమణిపై నమోదైన సెక్షన్లు ఇవే..
మాజీ మంత్రి, వైసీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని) సతీమణి జయసుధ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి మానస తేజపై బందరు తాలుకా PSలో కేసు నమోదైంది. జయసుధ పేరిట ఉన్న గోడౌన్లో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు సివిల్ సప్లయిస్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు వీరి ఇరువురిపై 316 (3), 316 (5), 61 (2) రెడ్ విత్ 3 (5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 11, 2024
VJA: ప్రయాణికులను మోసం చేస్తున్న నలుగురు అరెస్ట్
ప్రయాణికులను ఏమార్చి దొంగతనాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు విజయవాడ పోలీసులు వెల్లడించారు. ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ సురేష్, తారకేశ్వరరావు, కంబల శ్రీను, రాజు అనే వ్యక్తులు బస్టాండ్‌ల వద్ద ప్రయాణికులను మోసం చేస్తూ ఉంటారన్నారు. ఫిర్యాదులు రావడంతో నిఘా పెట్టి వీరిని పట్టుకున్నామని చెప్పారు. వారి నుంచి రూ.1,50,000 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.