News April 27, 2024
30న టంగుటూరు రానున్న సీఎం జగన్

ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచార సభ ఈ నెల 30న ఉదయం 10 గంటలకు టంగుటూరులో జరగనున్నట్లు రాష్ట్ర మంత్రి, కొండపి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. వైసీపీ శ్రేణులు ముందుగా కొండపిలో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని షెడ్యూలు విడుదల చేశారు. అయితే సీఎం పర్యటనకు, జన సమీకరణకు టంగుటూరు అనుకూలంగా ఉంటుందని భావించి మార్చినట్లు మంత్రి సురేశ్ తెలియచేశారు.
Similar News
News December 13, 2025
కొండపి: తీవ్రంగా నష్టపోయిన పొగాకు రైతులు

కొండపి పొగాకు వేలంకేంద్రంలో కొనుగోళ్లు ముగిసినప్పటికీ రైతులకు తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. సుమారు వేలం 9నెలల పాటు నిర్వహించడంతో పండించిన పొగాకు నాణ్యత కోల్పోయి ఆశించినంత మేర ధరలు రాక రైతులు నష్టాల బాట పట్టారు. బోర్డ్ అధికారులు రైతులకు సగటు ధర ఇప్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఒక్కో బ్యారర్‌కు రూ.2లక్షల పైబడి నష్టం వాటిలినట్లు రైతులు వాపోతున్నారు.
News December 13, 2025
ప్రకాశం: అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల జాబితా విడుదల

ప్రకాశం జిల్లాలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లగా ఎంపికైన 117 మందితో జాబితా విడుదల చేశామని డీఈవో రేణుక తెలిపారు. www.prakasamschooledu.com ద్వారా జాబితా చెక్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 15వ తేదీలోగా కేటాయించిన పాఠశాలల్లో జాయిన్ కావాలని ఆదేశించారు. సంబంధిత హెచ్ఎంలు ప్రతి నెలా 2వ తేదీన డ్యూటీ సర్టిఫికేట్ సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలన్నారు.
News December 13, 2025
ప్రకాశం జిల్లాలో 5.26 లక్షల సంతకాల సేకరణ

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా సేకరించిన సంతకాల పత్రాలను వైసీపీ రాష్ట్ర కార్యాలయానికి సోమవారం తరలిస్తామని దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా జిల్లాలో 5.26 లక్షల మంది సంతకాలు చేశారని చెప్పారు. వాటిని ప్రత్యేక వాహనం ద్వారా వైసీపీ ఆఫీసుకు తరలిస్తామన్నారు.


