News August 28, 2024
30న వనమహోత్సవం.. ఒక్క రోజే లక్ష మొక్కలు

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 30న వనమహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టర్‌లో మంగళవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి గ్రామంలో 200 మొక్కలు నాటేలా ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నామన్నారు. దీనికి అవసరమైన యాక్షన్ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఒక్క రోజులోనే జిల్లా వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
Similar News
News July 5, 2025
ఈనెల 10న జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్: కలెక్టర్

ఈనెల 10న జిల్లాలో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించడం జరిగిందని, ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో కూడా పీటీఎం సమావేశాలు నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
News July 5, 2025
పాలకొల్లు: మూడు రోజుల వ్యవధిలో తల్లి కూతురు మృతి

పాలకొల్లులో ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం ఆడబిడ్డకు జన్మనిచ్చి తీవ్ర రక్తస్రావంతో సంగినీడి జయశ్రీ మృతి చెందిన విషయం తెలిసిందే. డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహారించారని ఆరోపిస్తూ ఆరోజు బంధువులు ఆందోళన చేపట్టారు. శిశువుకు వైద్యం కోసం భీమవరం తరలించారు. ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం వైద్యులు ఇంటికి పంపించేశారు. శనివారం ఉదయం శిశువు మృతి చెందింది. తల్లి, కూతురు మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
News July 5, 2025
ఆచంట: గోదారమ్మకు చేరుతున్న వరద నీరు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటు పెరుగుతోంది. ఆచంట మండలంలో కోడేరు, పెదమల్లం, కరుగోరుమిల్లి, భీమలాపురం పుష్కర ఘాట్ల వద్దకు వరద నీరు చేరింది. పోలవరం వద్ద గోదావరికి వరద నీరు భారీగా చేరుకోవడంతో మరో రెండు, మూడు రోజుల్లో మరింత వరద ప్రవాహం ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.