News August 28, 2024

30న విజయనగరంలో జాబ్ మేళా

image

పలు కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విజయనగరం జిల్లా ఉపాధి శాఖాధికారి డి.అరుణ తెలిపారు. ఈనెల 30న వివిధ కంపెనీల్లో 540 ఉద్యోగాల భర్తీకి జిల్లా ఉపాధి కార్యాలయంలో ఆన్‌లైన్ ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తామని చెప్పారు. అభ్యర్థులు http://rb.gy/9r3mcb లింక్ ద్వారా ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.

Similar News

News September 10, 2024

ప్రజలు LHMS సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: ఎస్పీ

image

విజయనగరం పట్టణం, రూరల్ స్టేషన్లతో పాటు నెల్లిమర్ల, బొబ్బిలి పోలీసు స్టేషన్ పరిధిలోని మున్సిపల్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు LHMS (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం) సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. తమ అవసరాల నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్లే సమయాల్లో తమ ఇండ్లలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ఇది పనిచేస్తోందని తెలిపారు.

News September 10, 2024

పుష్పాలంకరణలో శ్రీ పైడితల్లి అమ్మవారు

image

విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లమ్మకు చదురుగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ప్రీతికరమైన రోజు మంగళవారం కావడంతో ఆలయ అర్చకులు వేకువజాము నుంచి పంచామృతాభిషేకాలు, పూజలు నిర్వహించారు. అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.

News September 10, 2024

బొబ్బిలి : నెలరోజులకే రూ.94లక్షలు గంగార్పణం

image

పారాది వద్ద వేగావతి నదిపై రూ.94 లక్షలు వెచ్చించి నిర్మించిన కాజ్వే నెల రోజులుకే గంగ పాలైంది. ఇప్పటికే నాలుగుసార్లు మరమ్మతులు చేశారు. ఈసారి వర్షాలకు ఐదు రోజులుగా నీరు పారడంతో సగం వరకు పాడైపోయింది. పూర్తిస్థాయిలో మరమ్మ తులు చేస్తే కానీ వాహనాల రాకపోకలకు వీలు ఉండదని అధికారులు అంటున్నారు. నీరు పూర్తిగా తగ్గిన తర్వాతే మరమ్మతులు చేస్తామని ఏఈ రాజు తెలిపారు.