News March 9, 2025

30వ తేదీ నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

image

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యి వచ్చే నెల 12న ముగుస్తాయి. శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా చైత్ర మాసంలో నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో అత్యంత పవిత్రమైన రోజు శ్రీరామ నవమి. ఈ పవిత్రమైన రోజున శ్రీసీతారామ కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీరాముని పట్టాభిషేకం జరుగుతుంది.

Similar News

News February 24, 2026

కృష్ణా డెల్టాకు 195 టీఎంసీలు కావాల్సిందే.. ఏపీ వాదన

image

AP: కృష్టా డెల్టాలో రైతులు స్వల్పకాలిక రకాలను సాగు చేయాలంటూ TG ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఏపీ ఖండించింది. ‘కృష్ణా డెల్టాలో పంట కాలాన్ని 180 రోజులుగా KWDT-1 నిర్ధారించింది. ఇందుకు 195 టీఎంసీల నీరు అవసరం. అయితే తెలంగాణ ప్రతినిధి పంట కాలాన్ని 122 రోజులుగా చెబుతూ 130 టీఎంసీలే సరిపోతాయని చెప్పడం అశాస్త్రీయం’ అని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఏపీ న్యాయవాది జైదీప్ వాదనలు వినిపించారు.

News February 24, 2026

యాభై ఏళ్ల ప్రస్థానం.. ముగిసినట్లేనా?

image

ADB, KNR జిల్లాల్లో మావోయిస్టుల ఉనికి తగ్గింది. అగ్రనేత దేవ్ జీ లొంగుబాటు వార్తలతో KNR జిల్లాలో ముప్పాల లక్ష్మణరావుతోపాటు మరో కేంద్ర కమిటీ సభ్యుడే మిగిలినట్లు తెలుస్తోంది. 2000 నుంచి 2026, ఫిబ్రవరి 21 వరకు మావోయిస్టుల పోరులో మొత్తం 12,170 మంది మృతి చెందారు. వీరిలో 5,057 మంది మావోయిస్టులు, 2,007 మంది భద్రతా సిబ్బంది, 4,138 మంది పౌరులున్నారు. మూడేళ్లలో 793 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు.

News February 24, 2026

భూపాలపల్లి జిల్లాలో 8.4 మి.మీల వర్షపాతం నమోదు

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తంగా 8.4 మి.మీల వర్షపాతం నమోదైంది. టేకుమట్ల మండలంలో అత్యధికంగా 6.2 మి.మీలు, రేగొండ మండలంలో 2.2 మి.మీల వర్షం కురిసింది. మహాదేవ్‌పూర్, పలిమెల, కాటారం, రేగొండ తదితర మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. జిల్లా సగటు వర్షపాతం 0.7 మి.మీలుగా నమోదైనట్లు సీపీఓ కార్యాలయం వెల్లడించింది.