News February 6, 2026
30వారాల గర్భాన్ని తొలగించేందుకు సుప్రీం అనుమతి!

బాయ్ ఫ్రెండ్ వల్ల 17ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అయిన ఓ అమ్మాయి 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. తన శరీరానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు సదరు యువతికే ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇష్టం లేని గర్భాన్ని దాల్చాలని ఏ స్త్రీని బలవంతం చేయలేమని జడ్జీలు పేర్కొన్నారు. బాధితురాలి మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని వెంటనే అబార్షన్ చేయాలని కోర్టు ఆదేశించింది.
Similar News
News February 6, 2026
ఇషాన్ కిషన్ టాప్-3లోనే ఆడతారు: సూర్య

T20 WCలో ఇషాన్ కిషన్ టాప్-3లోనే బ్యాటింగ్ చేస్తారని, అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్ చేయరని IND కెప్టెన్ సూర్య స్పష్టం చేశారు. NZ సిరీస్‌లో చూపించిన ఫామ్‌ను ఇషాన్ కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ‘<<19066790>>హర్షిత్ రాణా<<>> పరిస్థితిని ఫిజియోలు పరిశీలిస్తున్నారు. ఆడతారా లేదా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఆయన దూరమైతే గత రెండేళ్లలో బాగా రాణించిన ఫాస్ట్ బౌలర్‌ను తీసుకుంటాం’ అని తెలిపారు.
News February 6, 2026
సంపూర్ణ ఆహారం గొర్రెలకు అందకపోతే..

గొర్రెలకు సరైన పోషకాహారం అందకుంటే పెరుగుదల లోపించి త్వరగా బరువు పెరగవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి సులభంగా వ్యాధుల బారిన పడతాయి. అంతర, బాహ్య పరాన్న జీవుల కారణంగా గొర్రెలకు వ్యాధుల ముప్పు పెరుగుతుంది. గొర్రెల ఉన్ని రాలిపోతుంది. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. గర్భస్రావాలు, పిల్లలు తక్కువ బరువుతో, బలహీనంగా జన్మించడం, సకాలంలో ఎదకు రాకపోవడం, ఈతల మధ్య వ్యవధి పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
News February 6, 2026
రాయలసీమ లిఫ్ట్ పేరిట వైసీపీ డ్రామాలు: సీఎం

AP: కరవుతో కటకటలాడిన రాయలసీమను ఉద్యాన హబ్‌గా మారుస్తున్నామని సీఎం చంద్రబాబు ఎమ్మిగనూరు సభలో తెలిపారు. ఏటా 200 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉద్యాన ఉత్పత్తులు రాయలసీమ నుంచి వస్తున్నాయన్నారు. డ్రిప్ ఇరిగేషన్ సహా వివిధ రకాలుగా ఈ ప్రాంతానికి నీరిచ్చామని చెప్పారు. మచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ఉంచుకుని రాయలసీమ లిఫ్ట్ పేరిట వైసీపీ డ్రామాలు ఆడుతోందని.. ఎలాంటి అనుమతులూ లేవని ఎన్జీటీ దానిని నిలిపేసిందన్నారు.


