News March 17, 2025
30 ఏళ్లకు TDP విక్టరీ.. అప్పుడే తమ్ముళ్లకు తలనొప్పులు

GDనెల్లూరులో 30 ఏళ్లకు విక్టరీ కొట్టిన TDPకి తలనొప్పులు మొదలయ్యాయి. కొందరు టీడీపీ నేతలే MLA థామస్‌కు వ్యతిరేంకగా పని చేస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది. GDN పర్యటనకు వచ్చిన CM సైతం దీనిపై ఘాటుగానే స్పందించారు. థామస్ ఎక్కువగా నియోజకవర్గం బయటే ఉండటంతో నేతలు, కార్యకర్తలు సైతం అసంతృప్తితో ఉన్నారంట. ఇలాంటివి తానంటే గిట్టని వారు చేస్తోన్న అసత్య ప్రచారాలని, వారిని వదలనని థామస్ గట్టిగానే హెచ్చరించారు.
Similar News
News April 23, 2025
రొంపిచర్ల: పదో తరగతి ఒకేసారి పాసైన తండ్రి, కూతురు

రొంపిచర్ల గ్రామపంచాయతీ పాలెం వీధికి చెందిన తండ్రి, కూతురు పదో తరగతి పరీక్షలు రాసి ఒకే సారి పాసైన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 1995-96 సంవత్సరంలో 10 పరీక్షలు రాసిన బి.షబ్బీర్ ఫెయిల్ అయ్యారు. అప్పట్లో ప్రమాదవశాత్తు గాయపడి దివ్యాంగుడిగా మారాడు. ఏదైనా ఉద్యోగం సాధించాలని కుమార్తెతో పాటు పదో తరగతి పరీక్షలు రాశాడు. తండ్రి బి.షబ్బీర్‌కు 319 మార్కులు, కుమార్తె బి.సమీనాకు 309 మార్కులు వచ్చాయి.
News April 23, 2025
టెన్త్ ఫలితాలు: 6 నుంచి 24వ స్థానానికి చిత్తూరు జిల్లా

ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో చిత్తూరు జిల్లాలో ఉత్తీర్ణత శాతం తీవ్ర నిరాశకు గురి చేసింది. గతేడాది టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 91.28% ఉత్తీర్ణతతో 6వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది 67.06 శాతంతో 24వ స్థానంలో నిలిచింది. ఏడాది వ్యవధిలో దాదాపు 18 స్థానాలు దిగజారడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.
News April 23, 2025
టెన్త్ ఫలితాల్లో 24వ స్థానంలో చిత్తూరు జిల్లా

తాజా టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 24వ స్థానంలో నిలించింది. మొత్తం 20,796 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 13,946 మంది పాస్ అయ్యారు. 10,723 మంది అబ్బాయిలకుగాను 6,573 మంది, అమ్మాయిలు 10,073 మందికిగాను 7,373 మంది పాస్ అయ్యారు. కాగా 67.06 శాతం ఉత్తీర్ణత నమోదైంది.