News April 24, 2024

30 మంది అధికారులపై క్రిమినల్ కేసులు: రొనాల్డ్ రాస్

image

HYD జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల విధుల కోసం నియమితులైన అధికారులు శిక్షణ తరగతులకు గైర్హాజరవడంపై జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ కొరడా ఝులిపించారు. శిక్షణ తరగతులకు గైర్హాజరైన 30 మంది సిబ్బందిపై ఆర్పీ యాక్ట్ 1951 సెక్షన్ 134 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు.

Similar News

News December 2, 2025

హైదరాబాద్‌లో మరో ఫిల్మ్ సిటీ

image

తెలంగాణ రైజింగ్ విజన్‌కు భారీ స్పందన లభిస్తోంది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు, వ్యక్తులు ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్‌కు చెందిన అజయ్ దేవ్‌గణ్ ఫ్యూచర్ సిటీలో తన ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నారు. ఇదివరకు సీఎం రేవంత్ రెడ్డిని కలసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వంతో M0U చేసుకోనున్నట్లు సమాచారం.

News December 2, 2025

HYDలో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్

image

హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం జరగనుంది. యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం హైదరాబాదులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 23 యూరోపియన్ దేశాలకు చెందిన 23 ఉత్తమ చిత్రాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానున్నాయి. ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్, శ్రీసారథి స్టూడియోస్, అలయన్స్ ఫ్రాన్సిస్ హైదరాబాద్‌లో ఈ సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈనెల 5వ తేదీ నుంచి 14 వరకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

News December 2, 2025

HYD: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

image

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఖాజాగూడా చెరువు ఎఫ్‌టి‌ఎల్ పరిధిలో 8 భారీ టవర్స్ అక్రమంగా నిర్మిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్, మురళి నాయక్, రాకేష్ రెడ్డి పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, బిల్డర్లకు నోటీసులిచ్చింది.