News January 30, 2026
30 ఏళ్లుగా మగాడిలా… ఆ తల్లి ఎందుకలా మారింది?

తూత్తుకుడి(TN)కి చెందిన పెచియమ్మాళ్(57) 30 ఏళ్లుగా పురుషుడిగా జీవిస్తోంది. దీని వెనుక కన్నీటి కథ ఉంది. పెళ్లి జరిగిన 15 రోజులకే భర్త చనిపోయాడు. గర్భంతో ఉన్నట్లు తర్వాత తెలిసింది. బిడ్డ కోసం, వేధింపులను తప్పించుకునేందుకు మగాడిగా మారింది. జుట్టు కత్తిరించుకుని, ముత్తుగా ఐడెంటిటీని మార్చుకుంది. ఏళ్లుగా ఎన్నో కష్టాలకోర్చి కూతురిని పెంచింది. ఇటీవల పెళ్లి చేసింది. ఇకపైనా ముత్తుగానే ఉంటానని అంటోంది.
Similar News
News February 14, 2026
జొన్న పంటలో కంకి నల్లిని ఎలా నివారించాలి?

జొన్న పంటలో గింజలు పాలు పోసుకునే దశలో పిల్ల, పెద్ద పురుగులు ఆశించి రసం పీల్చుతాయి. దీని వల్ల గింజలు నొక్కులుగా మారి కంకిలో తక్కువ గింజలు కలిగి ఉంటాయి. గింజల మీద ఎరుపు మచ్చలు ఏర్పడి అవి క్రమంగా నల్లగా మారతాయి. గింజలు గట్టిపడ్డాక ఈ పురుగు ఆశించదు. కంకి నల్లి నివారణకు పూత దశలో లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ML కలిపి 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News February 14, 2026
తల పొగరు సెలబ్రేషన్స్.. అనుభవిస్తున్నారుగా!

వన్డే వరల్డ్‌కప్-2023 గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్ల తల పొగరుతో కూడిన సెలబ్రేషన్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైట్ బాల్ క్రికెట్‌లో AUS ప్రదర్శన దారుణంగా మారింది. T20 WC2024లో అఫ్గాన్ చేతిలో ఓటమి, సెమీస్ చేరకపోవడం, పాక్, శ్రీలంక, సౌతాఫ్రికా, ఇండియా చేతిలో వన్డే సిరీస్ ఓటమి, గబ్బాలో విండీస్ చేతిలో భంగపాటు, నిన్న జింబాబ్వేపై ఓటమి ఇలా కొనసాగుతూనే ఉంది.
News February 14, 2026
రూ.3.32 లక్షల కోట్లతో బడ్జెట్!

AP: అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఉ.11.15 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2026-27 FYకి సంబంధించిన ఈ బడ్జెట్ రూ.3.32 లక్షల కోట్లకు పైగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఉ.10.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశంలో పద్దుకు ఆమోదం తెలపనుంది. కాగా బడ్జెట్‌లో సూపర్ సిక్స్ హామీలు, రోడ్ల అభివృద్ధితో పాటు పారిశ్రామిక రంగ విస్తరణకు నిధులు కేటాయించే అవకాశముంది.


