News November 15, 2025
30 ఓట్లతో గెలిచాడు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ(BSP) ఒకే ఒక్క సీటు గెలిచింది. రామ్‌గఢ్ నుంచి పోటీ చేసిన సతీశ్ కుమార్ సింగ్ యాదవ్ కేవలం 30 ఓట్లతో గట్టెక్కారు. ఆయనకు 72,689 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అశోక్ కుమార్ సింగ్‌కు 72,659 ఓట్లు పడ్డాయి. చివరి వరకూ ఇద్దరి మధ్య దోబూచులాడిన విజయం అంతిమంగా సతీశ్‌నే వరించింది. ఇక బిహార్‌లో ఎన్డీఏ 202 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.
Similar News
News November 15, 2025
గిల్ హెల్త్‌పై BCCI అప్‌డేట్

ఈడెన్ గార్డెన్స్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్ కేవలం 3 బంతులే ఆడి మెడనొప్పి కారణంగా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అతని ఆరోగ్య పరిస్థితిపై BCCI అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘శుభ్‌మన్ గిల్‌కు మెడ కండరాలు పట్టేశాయి. వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. వైద్య నివేదిక వచ్చిన తర్వాత అతను ఈరోజు ఆడతారా.. లేదా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొంది.
News November 15, 2025
తండ్రిని తలచుకొని మహేశ్ ఎమోషనల్

తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణను తలచుకొని హీరో మహేశ్ బాబు ఎమోషనల్ అయ్యారు. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా తండ్రితో కలిసి చేసిన మూవీలో ఓ స్టిల్‌ను షేర్ చేసుకున్నారు. ‘ఇవాళ మిమ్మల్ని కాస్త ఎక్కువగానే మిస్ అవుతున్నాను. నాన్నా మీరు ఉండి ఉంటే గర్వపడేవారు’ అని ట్వీట్ చేశారు. ఇది చూసి మహేశ్ ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. ‘ఆయన్ను మీరు ఎప్పుడో గర్వపడేలా చేశారు’ అని కామెంట్స్ చేస్తున్నారు.
News November 15, 2025
CSK కెప్టెన్‌గా సంజూ శాంసన్?

చెన్నై సూపర్ కింగ్స్‌లోకి సంజూ శాంసన్ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ధోనీ తర్వాత జట్టు పగ్గాలు ఎవరికన్న ప్రశ్నకు సమాధానంగానే సంజూను జట్టులోకి తీసుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ధోనీ నుంచి రుతురాజ్‌కు ఆ బాధ్యతలిచ్చారు. మళ్లీ MSDనే కెప్టెన్ చేశారు. అయితే ఈ సమస్యకు సంజూనే శాశ్వత పరిష్కారమని విశ్లేషకులూ భావిస్తున్నారు. అటు జట్టు భవిష్యత్తు కోసం జడేజానూ CSK త్యాగం చేసిందంటున్నారు.


