News October 23, 2024

BRICSలో చేరేందుకు 30+ కంట్రీస్ ఆసక్తి: పుతిన్

image

BRICSలో జాయిన్ అయ్యేందుకు 30+ కంట్రీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అన్నారు. తమ కూటమితో సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్న గ్లోబల్ సౌత్, ఈస్ట్ దేశాల ఆసక్తిని విస్మరించకూడదని చెప్పారు. అదే టైమ్‌లో బ్యాలెన్స్ మెయింటేన్ చేయడం, సామర్థ్యం తగ్గకుండా చూసుకోవడం అవసరమన్నారు. తీవ్రమైన ప్రాంతీయ వివాదాలపై డిస్కస్ చేస్తామన్నారు. UNకు BRICS పోటీగా మారొచ్చన్న సందేహాలున్న సంగతి తెలిసిందే.

Similar News

News October 23, 2024

హైదరాబాద్‌లో గుండెపోటుతో సిక్కోలు వాసి మృతి

image

హైదరాబాద్‌లో పెయింటింగ్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న సిక్కోలు వాసి గుండెపోటుతో మృతిచెందాడు. టెక్కలి మండలం లింగాలవలస పంచాయతీ సొర్లిగాం గ్రామానికి చెందిన కూన గణపతిరావు (39) బుధవారం HYDలో గుండెపోటుతో మృతిచెందాడు. గత కొన్నేళ్లుగా జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లిన ఆయన మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గురువారం నాటికి మృతదేహం స్వగ్రామం చేరుకుంటుందని గ్రామస్థులు తెలిపారు.

News October 23, 2024

రాష్ట్రంలో మెయనైస్‌పై నిషేధం?

image

TG: షావర్మా, ఫ్రైడ్ చికెన్, పిజ్జాపై మెయనైస్ వేసుకుని తింటే ఆ రుచే వేరు. అయితే పచ్చిగుడ్డుతో తయారుచేసే మెయనైస్ వల్ల ఈ ఏడాది HYDలో 10 ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైనట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తెల్లగా, క్రీమ్‌లాగా ఉండే మెయనైస్‌లో హానికర సూక్ష్మక్రిములు ఉంటాయని, దాన్ని బ్యాన్ చేయాలని కోరారు. కాగా ఇప్పటికే మెయనైస్‌పై కేరళ సర్కారు నిషేధం విధించింది.

News October 23, 2024

MH ఎన్నికలు.. 85 సీట్ల చొప్పున పోటీ

image

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి సీట్ల పంపకంపై క్లారిటీ వచ్చింది. 85 సీట్ల చొప్పున పోటీ చేయాలని కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ థాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు నిర్ణయించాయి. మిగతా 18 సీట్లపై కూటమిలోని మిగతా పార్టీలతో చర్చించి రేపు నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే తెలిపారు. ఈసారి తాము కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.