News July 12, 2024
చంద్రబాబు పాలనకు 30 రోజులు.. ఎన్ని మార్కులు?

ఏపీలో NDA ప్రభుత్వం కొలువుదీరి నేటికి నెల రోజులు పూర్తయింది. పెన్షన్ పెంపు, ఉచిత ఇసుక, DSC హామీలను అమలు చేస్తోంది. ఫ్రీ బస్సు, తల్లికి వందనం, మహిళలకు నెలకు రూ.1,500 లాంటి కీలక హామీలను నెరవేర్చాల్సి ఉంది. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ముందుకు కదులుతున్నాయి. పలుచోట్ల ఆడపిల్లలపై ఆకృత్యాలు కలవరపెడుతున్నాయి. మరి నెల రోజుల చంద్రబాబు పాలనపై 10కి మీరిచ్చే మార్కులెన్నో కామెంట్ చేయండి.
Similar News
News December 6, 2025
విమాన సర్వీసుల ఆలస్యంతో ప్రయాణికుల అవస్థలు

రాజమహేంద్రవరం (మధురపూడి) విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు కావడం, ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు ఇబ్బందులను చవి చూస్తున్నారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లాల్సిన విమాన సర్వీసులను, హైదరాబాద్ వెళ్లే రెండు సర్వీస్లను ఇండిగో సంస్థ రద్దు చేసింది. బెంగళూరు వెళ్లాల్సిన విమానం 7.15 గంటలకు రావాల్సి ఉండగా శుక్రవారంరాత్రి 11 గంటలకు వస్తుందని ప్రకటించారు. ముంబై వెళ్లే విమానాలు సైతం బాగా ఆలస్యంగా నడిచాయి.
News December 6, 2025
రబీ నువ్వుల సాగు.. నేలలు, నాటే సమయం

మురుగునీటి పారుదల బాగా ఉన్న నల్లరేగడి లేదా తేలిక నేలలు నువ్వుల పంట సాగుకు అనుకూలం. ఆమ్ల, క్షార గుణాలు కలిగిన నేలలు ఈ పంట సాగుకు పనికిరావు. తగినంత తేమ నిలుపుకొనే ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు మరింత అనువైనవి. కోస్తా జిల్లాల్లో రబీలో/రబీ వేసవి పంటగా డిసెంబర్ రెండో పక్షం నుంచి జనవరి నెలాఖరు వరకు నువ్వులను విత్తుకోవచ్చు. విత్తుట ఆలస్యమైతే పంటకు వెర్రి తెగులు ఆశించి దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
News December 6, 2025
ఇండిగో సంక్షోభం: CJI జోక్యం చేసుకోవాలని పిల్

ఇండిగో సంక్షోభంపై CJI జోక్యం చేసుకోవాలని కోరుతూ పిల్ దాఖలైంది. విమానయాన శాఖ, DGCA నుంచి స్టేటస్ రిపోర్టు తీసుకోవాలని, తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో అత్యవసర విచారణ కోసం పిటిషనర్ న్యాయవాదిని తన నివాసానికి పిలిపించి CJI మాట్లాడనున్నారని సమాచారం. మరోవైపు ఇండిగో సర్వీసులపై సమాచారం తెలుసుకుని రావాలని ప్రయాణికులను బెంగళూరు ఎయిర్పోర్టు కోరింది.


