News October 9, 2025

BELలో 30 ఇంజినీర్ పోస్టులు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)30 ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు OCT 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ITI, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.590, SC, ST, PWDలకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/

Similar News

News October 9, 2025

6 రోజుల్లోనే రూ.5,620 పెరిగిన గోల్డ్ రేట్

image

బంగారం ధరలు ఇవాళ కూడా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.220 పెరిగి రూ.1,24,150కు చేరింది. 6 రోజుల్లోనే రూ.5,620 పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.200 ఎగబాకి రికార్డు స్థాయిలో రూ.1,13,800 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,71,000కి చేరుకుంది. 6 రోజుల్లోనే రూ.9వేలు పెరగడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 9, 2025

లక్ష్మీదేవి పద్మం పైనే ఎందుకుంటుంది?

image

లక్ష్మీదేవిని పద్మంపై ఆసీనురాలిగా చూపడం వెనుక ఆధ్యాత్మిక సందేశం ఉంది. తామరపువ్వు నీటిలో అటూ ఇటూ కదులుతూ, ఊగుతూ ఉంటుంది. ఆ తామర మాదిరిగానే సంపద కూడా చంచలమైనది. అంటే నిలకడ లేనిదని అర్థం. లక్ష్మీదేవి కమలంపై కొలువై ధనం అశాశ్వత స్వభావాన్ని మానవులకు నిరంతరం గుర్తుచేస్తుంది. సంపద శాశ్వతం కాదని, మనిషి గర్వం లేకుండా ఉండాలని ఈ దైవిక రూపం మనకు బోధిస్తుంది. <<-se>>#DHARMASANDEHALU<<>>

News October 9, 2025

20 మంది చిన్నారుల మృతి.. ‘శ్రేసన్’ ఓనర్ అరెస్ట్

image

దగ్గు <<17954495>>మందు<<>> అంటేనే భయపడేలా కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ తయారు చేసిన శ్రేసన్ కంపెనీ(తమిళనాడు) ఓనర్‌ రంగనాథన్‌ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారుల మరణాలతో ఈ నెల 1, 2 తేదీల్లో అధికారులు చేసిన తనిఖీల్లో గ్యాస్ స్టవ్‌లపై రసాయనాలు వేడి చేయడం, తుప్పు పట్టిన పరికరాలు గుర్తించారు. అనుభవం లేని సిబ్బంది, గ్లౌజులు, మాస్కులు లేకుండా పనిచేస్తున్నట్లు గమనించారు. అనంతరం కంపెనీని సీజ్ చేశారు.