News September 29, 2024

’30 ESI ఆసుపత్రులు కేటాయించినందుకు ధన్యవాదాలు’

image

రాష్ట్రానికి 30 ESI ఆసుపత్రులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి విజయవాడ పశ్చిమ MLA సుజనా ధన్యవాదాలు తెలుపుతూ ఆదివారం ట్వీట్ చేశారు. అమరావతిలో రూ.250కోట్లతో 400 పడకల ESI ఆసుపత్రిని కేంద్రం మంజూరు చేసిందని సుజనా తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నానని సుజనా ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

Similar News

News November 7, 2025

గన్నవరంలో యాక్టీవ్ అవుతున్న వల్లభనేని వంశీ

image

గన్నవవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నియోజకవర్గంలో యాక్టీవ్ అవుతున్నారు. నకిలీ పట్టాల కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత వంశీ పొలిటికల్‌గా సైలెంట్ అయిపోయారు. ఒకానొక దశలో వంశీ పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకున్నారన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇటీవల వై.ఎస్ జగన్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వంశీ కూడా పాల్గొన్నారు. నియోజకవర్గంలోనూ చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

News November 7, 2025

పాడి పరిశ్రమ అభివృద్ధిలో పశు వైద్యుల పాత్ర ఘనమైనది: కలెక్టర్

image

పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం అభివృద్ధిలో పశు వైద్యుల పాత్ర ఎంతో ఘనమైనదని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ప్రజల జీవనోపాదులను మెరుగుపరచడంలో మరింత కృషి చేయాలన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పశువుల మిషన్-శాస్త్రీయ నిర్వహణ గొర్రెలు, మేకల పెంపకం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.

News November 6, 2025

మచిలీపట్నం: ఎన్నికల చట్టాలు, నిబంధనలపై వీడియో కాన్ఫరెన్స్

image

రాష్ట్రంలోని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల చట్టాలు, నియమ నిబంధనలపై ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. అవనిగడ్డ, పామర్రు, పెడన, గన్నవరం నియోజకవర్గాల రెవెన్యూ శాఖేతర అధికారులుగా డీఎస్‌వో, డీఎం పౌరసరఫరాల సంస్థ, బీసీ సంక్షేమ శాఖ అధికారి, ముడా వీసీలు ఓటర్ల నమోదు అధికారులుగా ఉంటారన్నారు.