News September 29, 2024

ఏపీకి 30 ESI ఆస్పత్రులు: పెమ్మసాని

image

APకి 30 ESI ఆస్పత్రులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. భూకేటాయింపులు పూర్తైన వెంటనే వీటి నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. అమరావతిలో రూ.250 కోట్లతో 400 పడకల ESI ఆస్పత్రి రాబోతోందన్నారు. అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి సుమారుగా వంద నిర్మాణాలు జరగాల్సి ఉందని, ఆయా శాఖలతో సంప్రదించి పనులు వేగంగా జరిగేలా చూస్తామన్నారు.

Similar News

News September 29, 2024

KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు

image

TG: హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ రూ.826 కోట్లతో 6 జంక్షన్లను ప్రభుత్వం నిర్మించనుంది. రెండు ప్యాకేజీలుగా నిర్మించే ఈ ప్రాజెక్ట్‌లో మొదటిగా 2 ఫ్లైఓవర్లు, 3 అండర్‌పాస్‌లు, సెకండ్ ప్యాకేజీలో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్‌పాస్‌లు అభివృద్ధి చేయనుంది. ఈ నిర్మాణాలు పూర్తైతే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, యూసుఫ్‌గూడ ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యలు తొలగనున్నాయి.

News September 29, 2024

మంత్రి ఉత్తమ్‌‌కు పితృవియోగం

image

TG: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పితృవియోగం కలిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి పురుషోత్తంరెడ్డి కన్నుమూశారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు.

News September 29, 2024

లడ్డూ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ

image

తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ జరుగుతున్న ప్రచారంపై ఐదుగురు పిటిషన్లు వేశారు. దీనిపై రిటైర్డ్ సుప్రీంకోర్టు/హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు జరపాలని పిటిషనర్లు కోరారు. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సహా పలువురు ఈ పిటిషన్లు వేశారు.